వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Election 2019 : తెలంగాణ లో లోకల్ వార్ కు... ముహూర్తం ఖరారు...22న నోటిఫికేషన్..? | Oneindia

జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

<strong>సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన </strong>సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన

జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష

జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లు, ఎన్ని దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో జరిగిన చర్చ ను బట్టి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని తెలుస్తోంది

 త్వరలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు

త్వరలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు

ఇక స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారుల, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే ఆర్డర్లు పంపారు . ఆర్ధర్లు అందుకున్న టీచర్లకు ఏప్రిల్ 15 నుండి 26వ తేదీల్లో ఏదో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.

లోక్ సభ ఫలితాలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచన

లోక్ సభ ఫలితాలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచన

దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఏప్రిల్ 15న సీఎస్, డీజీపీలతో, ఏప్రిల్ 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగా ఆ లోగానే పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు .

English summary
The Telangana government has given green signal to the local bodies election. On April 12, the Chief Minister conducted a review meeting of the Panchayati Raj Department for ZPTC and MPTC elections. The meeting was discussed the conducting of the elctions. It is said that the meeting is scheduled to be held in three phases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X