వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్లోకి మురళీధర్‌రావు, దత్తాత్రేయకు పార్టీ పగ్గాలు, టిఆర్ఎస్‌కు చెక్?

కేంద్ర మంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది.మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ కోసం దత్తాత్రేయ రాజీనామా చేశారని ప్రచారంగవర్నర్ పదవి లేదా పార్టీ బాధ్యతలను దత్తాత్రేయకు కట్టబెట్టే అవకా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధానమంత్రి మోడీ సెప్టెంబర్ 3వ, తేదిన పునర్వవ్యస్థీకరించనున్నారు. దీంతో దత్తాత్రేయ రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో గురువారం నాడు దత్తాత్రేయ సమావేశమయ్యారు. దత్తాత్రేయ మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. పార్టీ అవసరాల కోసం పని చేస్తానని అధిష్టానానికి దత్తాత్రేయ వెల్లడించారనే ప్రచారం సాగుతోంది. కానీ ఈ అంశంపై స్పష్టత లేదు. బండారు దత్తాత్రేయ కూడా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు.

ఒకవేళ కేంద్ర మంత్రిపదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేస్తే తెలంగాణ నుండి ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతోందనే చర్చ కూడ సాగుతోంది.

. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే.

ఆదివారం కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది.మోదీ కేబినెట్‌లో అన్నాడీఎంకే, జేడీయూ నేత‌లు కూడా చేర‌నున్నారు. కేంద్ర మంత్రుల‌ ప‌ద‌వుల నుంచి తొల‌గించిన బీజేపీ నేత‌ల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అధిష్ఠానం భావిస్తోంది.

దత్తాత్రేయను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు. మరో వైపు పార్టీ బాధ్యతలను నిర్వహించేందుకు కూడ దత్తన్న సుముఖంగా ఉన్నారని సమాచారం.

మురళీధర్‌రావుకు మంత్రివర్గంలో ఛాన్స్

మురళీధర్‌రావుకు మంత్రివర్గంలో ఛాన్స్

బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న మురళీధర్‌రావుకు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో ప్రచారం సాగుతోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు, ప్రధానమంత్రి మోడీకి మురళీధర్‌రావు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. అయితే దత్తాత్రేయను మంత్రివర్గం నుండి తప్పించి ఆయన స్థానంలో తెలంగాణ నుండి మురళీధర్‌రావుకు చాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ సాగుతోంది.

టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు

టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు

తెలంగాణలో టిఆర్ఎస్‌కు చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మురళీధర్‌రావును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉన్నట్టు ప్రచారం ఉంది. వెలమ సామాజికవర్గానికి చెందిన మురళీధర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. మురళీధర్‌రావు ప్రస్తుతం తమిళనాడు పార్టీ ఇంచార్జీగా కూడ ఉన్నారు. సంఘ్ పరివార్‌తో మురళీధర్‌రావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ తరుణంలో మురళీధర్‌రావుకు కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉందని సమాచారం.

దత్తాత్రేయకు పార్టీ బాధ్యతలు

దత్తాత్రేయకు పార్టీ బాధ్యతలు

దత్తాత్రేయకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.దత్తాత్రేయను తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగించుకోవాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందని సమాచారం. అయితే హైద్రాబాద్‌ నగరంలో మజ్లిస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బిజెపి వ్యూహరచన చేయనుంది. ఇందులో భాగంగానే దత్తన్నను పార్టీ అవసరాలకు ఉపయోగించుకోనుంది.దత్తాత్రేయ వయసు మీద పడడం కూడ మంత్రివర్గం నుండి తప్పించేందుకు కారణంగా ప్రచారంలో ఉంది.

తెలంగాణలో బలోపేతం కోసం వ్యూహం

తెలంగాణలో బలోపేతం కోసం వ్యూహం

2019 లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణలో బలోపేతం కావాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. మురళీధర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని బిజెపి భావిస్తోంది.గతంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విద్యాసాగర్‌రావు ఎంపిగా విజయం సాధించారు. మెట్‌పల్లి నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విద్యాసాగర్‌రావు మహరాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. అయితే ఉత్తర తెలంగాణలో బిజెపి బలోపేతం చేసేందుకు కెసిఆర్ సామాజికవర్గానికి చెందిన మురళీధర్‌రావును బిజెపి ఎంచుకొంది.

English summary
Union Ministers from Telugu states Bandaru Dattatreya and Nirmala Sitaraman have resigned to their posts. Bandaru Dattatreya has submitted his resignation to Prime Minister Narendra Modi at 10 : 30 am this morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X