హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరితో ప్రేమాయణం, రాసలీలలు.. తల్లి హత్య కేసులో ట్విస్టులెన్నో..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇద్దరితో ప్రేమాయణం వద్దన్నందుకు కన్నతల్లిని కడతేర్చింది కసాయి కూతురు. పైగా తల్లి మృతదేహాన్ని ఇంటిలో పెట్టుకుని ప్రియుడితో మూడు రోజులు సరదాగా గడిపింది. అంతేకాదు తండ్రితో జరిగిన గొడవ వల్లే తల్లి చనిపోయిందని పిట్టకథలు అల్లింది. అయితే తండ్రిని ప్రశ్నించిన పోలీసుల దర్యాప్తులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కూతురే తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందనే విషయం వెలుగు చూడటంతో చర్చానీయాంశంగా మారింది. హయత్ నగర్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఓకే.. కానీ

ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఓకే.. కానీ

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో పదేళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. తుర్కయాంజిల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్‌లో అద్దె ఇల్లు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అక్కడి సమీపంలోని ద్వారకా సాయి నగర్ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాడు.

ఒకే ఒక్క కూతురు కావడంతో కీర్తిని కాస్తా గారాబంగా పెంచారు. ప్రస్తుతం ఆమె దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కీర్తి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొద్ది నెలల కిందట పక్క కాలనీకి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు బాల్‌రెడ్డితో ప్రేమలో పడింది. అది కాస్తా రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు.

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!

పెళ్లి కుదిరాక తప్పటడగులు.. పక్కింటి కుర్రాడితో సరాదాలు

పెళ్లి కుదిరాక తప్పటడగులు.. పక్కింటి కుర్రాడితో సరాదాలు

కీర్తి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించారు. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. అయితే ఇటీవల ఇంటి పక్కన ఉండే శశి కుమార్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. విషయం తెలిసిన తల్లి కూతురును మందలించింది. బాల్‌రెడ్డితో వివాహం కుదిరాక ఇప్పుడు ఆ యువకుడితో తిరగడమేంటని నిలదీసింది. అంతేకాదు ఆ ఇద్దరు యువకులతో కీర్తి హద్దులు దాటిందనే విషయం కూడా తల్లికి తెలిసింది. దాంతో పలుమార్లు సీరియస్‌గా మందలించింది.

ఎదిగిన ఆడపిల్ల ఇలా చేయకూడదని.. పద్దతిగా ఉండాలని చెబుతూనే ప్రవర్తన మార్చుకోవాలంటూ సూచించింది. అయితే తల్లి తన మంచి కోరుతుందని భావించని కీర్తి మరోలా అర్థం చేసుకుంది. తనకు తల్లి అడ్డంకిగా మారిందని భావించి ఇంటి పక్కన ఉండే రెండో ప్రియుడు శశి కుమార్‌తో కలిసి హత్య చేయడానికి సిద్ధమైంది. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రజితను వారిద్దరూ కలిసి హతమార్చారు.

తల్లిని చంపి రెండో ప్రియుడితో సరాదాగా

తల్లిని చంపి రెండో ప్రియుడితో సరాదాగా

తల్లిని చంపిన తర్వాత మృతదేహాన్ని ఏంచేయాలో పాలుపోని కీర్తి మూడు రోజులు ఇంటిలో అలాగే ఉండిపోయింది. అంతేకాదు రెండో ప్రియుడు శశి కుమార్‌తో మూడు రోజులు సరాదాగా గడిపింది. ఒకవైపు తల్లి డెడ్‌బాడీ ఇంట్లో ఉండగానే హద్దులు దాటి ప్రవర్తించింది. చివరకు దుర్వాసన రావడంతో తల్లి మృతదేహాన్ని బయట పడేయాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో తమ స్వంత గ్రామమైన రామన్నపేట శివారులోని రైల్వే ట్రాక్‌పై పడేయాలని భావించింది.

ఆ మేరకు శశి కుమార్ తండ్రికి చెందిన కారులో ఆమె డెడ్‌బాడీ తరలించారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే రామన్నపేట రైల్వే పోలీసులు ఆ మృతదేహం స్వాధీనం చేసుకుని ఆమె కుటుంబీకులు ఎవరైనా వస్తారేమోనని రెండు రోజులు వేచి చూశారు. ఎవరూ రాకపోయేసరికి వారే దహన సంస్కారాలు నిర్వహించినట్లు సమాచారం. వృత్తిరీత్యా తండ్రి ఇతర ప్రాంతాలకు లాంగ్ ట్రిప్ వెళ్లడంతో కీర్తి ఆటలు అనుకున్నట్లుగా సాగాయి.

తండ్రిపై ఫిర్యాదు.. తప్పించుకునేందుకు కొత్త డ్రామా.. కానీ చివరకు..!

తండ్రిపై ఫిర్యాదు.. తప్పించుకునేందుకు కొత్త డ్రామా.. కానీ చివరకు..!

ఇంత నాటకమాడిన కీర్తి మరో డ్రామాకు తెర తీసింది. తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే తల్లి మృతదేహం స్వంత గ్రామ శివారులో పడేసిన అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి కాలేజీ నుంచి వైజాగ్ టూర్ వెళుతున్నట్లు చెప్పింది. కానీ ఆమె టూర్‌కు వెళ్లకుండా రెండో ప్రియుడు శశి కుమార్ ఇంట్లో అతడితో సరాదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన డ్యూటీ నుంచి ఇంటికి చేరుకున్న తండ్రి భార్య రజిత కనిపించడం లేదని కూతురుకు ఫోన్ చేశాడు. అయితే అమ్మ కనిపించడం లేదనే విషయం తెలియడంతో హుటాహుటిన టూర్ మధ్యలో నుంచి వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది కీర్తి.

ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

పోలీసుల దర్యాప్తులో తప్పు ఒప్పుకున్న కీర్తి

పోలీసుల దర్యాప్తులో తప్పు ఒప్పుకున్న కీర్తి

తండ్రి తాగొచ్చి తల్లిని హింసించేవాడంటూ పోలీసులకు కీర్తి ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ రెడ్డి కంగు తిన్నాడు. ఆ క్రమంలో బంధువులు కీర్తిని పలు రకాలుగా ప్రశ్నించారు. అసలు వైజాగ్ టూర్ ఎందుకు వెళ్లావు.. నీ వెంట ఎవరు వచ్చారు.. తదితర వివరాలు ఆరా తీయడంతో మొదట పొంతన లేని సమాధానాలు చెప్పింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించి కీర్తి మీద అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కీర్తిని తమదైన శైలిలో విచారించారు. అప్పుడుగానీ చేసిన తప్పు ఒప్పుకోక తప్పలేదు. రెండో ప్రియుడు శశి కుమార్‌తో కలిసి తల్లిని హత్య చేసినట్లు అంగీకరించింది. కీర్తితో పాటు శశి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

English summary
Daughter murdered his mother with help of second boy friend in her home at hayat nagar, hyderabad. New Twist find out in Police Investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X