వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Daughter of india: గీత తమ కూతురేనంటూ తెలంగాణ పంపతుల కన్నీటి వ్యథ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్నతనంలో తప్పిపోయి పాకిస్థాన్‌కు వెళ్లి.. తిరిగి దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన గీత.. తన తల్లిదండ్రుల కోసం వెదుకుతోంది. రెండ్రోజుల క్రితం తెలంగాణలోని బాసరకు వచ్చిన ఆమె.. అక్కడివారిని కలిసి ఆచూకీ కోసం ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయింది.

ఆ గీత తమ కూతురేనంటూ..

ఆ గీత తమ కూతురేనంటూ..

ఇది ఇలావుంటే, ఆ మూగ యువతి గీత తమ కూతురేనని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు రాయినిపట్నానికి చెందిన కోల యాకయ్య, శాంత దంపతులు అంటున్నారు. గీత తమ స్వగ్రామాన్ని గుర్తించడం కోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతోపాటు మంగళవారం బాసరకు వచ్చిన విషయం తెలిసిందే.

బుధవారం రాత్రి ఓ వార్తా ఛానల్‌లో గీత గురించిన వార్త చూసిన యాకయ్య దంపతులు.. ఆమె 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమార్తేనంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు 2000 సంవత్సరంలో కుమార్తె జన్మించిందని, ఆమెకు సౌజన్యగా నామకరణం చేసినట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచే మాట్లాడేది కాదని, సైగలే చేసేదని చెప్పారు.

హైదరాబాద్‌లో అదృశ్యం..

హైదరాబాద్‌లో అదృశ్యం..

2005లో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి సుచిత్ర ప్రాంతంలో నివసించామని యాకయ్య దంపతులు తెలిపారు. కుమార్తెకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు ఇంటి దగ్గరే వదిలి తామిద్దరం పనికి వెళ్లామని, తిరిగి వచ్చే సరికి ఆమె కనిపించలేదని తెలిపారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో మరుసటి రోజే జీడిమెట్ల, కొంపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

చిన్ననాటి దుస్తులే జ్ఞాపకంగా..

చిన్ననాటి దుస్తులే జ్ఞాపకంగా..

ఆ తర్వాత కూడా నెలరోజులపాటు అంతా వెదికినా ఆచూకీ లభించలేదని యాకయ్య దంపతులు వాపోయారు. ఏకైక కుమార్తె తప్పిపోవడంతో తట్టుకోలేకపోయామని, అప్పట్నుంచి తమ కూతురు దుస్తులను చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నామని కంటతడి పెట్టారు. సౌజన్య కుడి ముఖంపై కంటి పక్కన, కుడి భుజంపైనా పుట్టుమచ్చలున్నాయని ఆనవాలు తెలిపారు. ఒకసారి తమను గీత వద్దకు తీసుకెళ్తే గుర్తుపడతామని యాకయ్య, శాంత దంపతులు చెబుతున్నారు.

గీత చెప్పిన ఆనవాళ్లు..

గీత చెప్పిన ఆనవాళ్లు..

ఇది ఇలావుండగా, తన చిన్న తనంలో తమవారు ఇడ్లీలు తినేవారని, ధాన్యం ఎక్కువగా పండించేవారని సైగలతో గీత వివరించింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. గీత తల్లిదండ్రుల కోసం వెదుతుకున్నారు. ఆమె తల్లిదండ్రులు తెలంగాణ లేదా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారై ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రుల ఆచూకీ మాత్రం లభించలేదు.

English summary
Daughter of india: geetha is our child, says mahaboobabad couple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X