• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో మరో కొత్త పార్టీ! -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?

|

తెలంగాణలో గడిచిన కొంత కాలంగా ఈక్వేషన్లు మారుతుండగా, మరో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందా? ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా చేవచచ్చిన స్థితిలోకి వెళుతుండగా, రాష్ట్ర, కేంద్రాల్లోని అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలను నిలువరించడం కొత్త శక్తుల వల్ల అవుతుందా? రాజన్న రాజ్యం పేరుతో రెడ్డి-బహుజన కాన్సెప్ట్ తో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టనుండగా, ప్రాంతీయత విమర్శలు లేని పక్కా లోకల్ పార్టీ పెడితే వర్కౌట్ అవుతుందా? లాంటి ప్రశ్నలెన్నో వ్యక్తమవుతున్నాయి కొండా విశ్వేశర్ రెడ్డి ప్రకటన తర్వాత.

viral video: ఒక్క దెబ్బతో తల్లిని చంపేశాడు -అందరి ఇళ్లలో గొడవలాగే మొదలై..'

 తెలంగాణలో కొత్త పార్టీ?

తెలంగాణలో కొత్త పార్టీ?

సమైక్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి డిప్యూటీ ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి (ఈయన పేరుతోనే రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది) మనవడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొన్న ఆదివారం వెల్లడించిన ఆయన, ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో, భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నదానిపై అభిమానులకు బుధవారం ఓ లేఖ రాశారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే దిశగానూ ఆలోచనలు చేస్తున్నట్లు ఆ లేఖలో కొండా పేర్కొన్నారు.

ముందే చెప్పా.. ఎన్నికల దాకా ఆగాను

ముందే చెప్పా.. ఎన్నికల దాకా ఆగాను

కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని, ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా రోజుల కిందటే లేఖను పంపానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, తన రాజీనామా వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నష్టం కలగొద్దనే, ఉత్తమ్ సూచన మేరకు పోలింగ్ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించానని తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో చేవెళ్ల సహా పలు ప్రాంతాల నేతలు, నాయకులను కలిసి విస్తృత స్థాయిలో చర్చిస్తానని, కొత్త పార్టీ పెట్టాలా... ఇండిపెండెంట్ గా ఉండాలా... మరో పార్టీలో చేరాలా అని అందరితో కలిసి నిర్ణయం తీసుకుంటానని కొండా తెలిపారు. నిజంగా

కొండాకు రేవంత్ రెడ్డి అండ!

కొండాకు రేవంత్ రెడ్డి అండ!

తెలంగాణ కాంగ్రెస్ శాఖను పూర్తిగా విస్మరించినట్లుగా అధిష్టానం వ్యవహరిస్తున్నది, కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు చేయకుండా గాంధీ భవన్ లో ముచ్చట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఆ పార్టీని వీడి షర్మిల పార్టీలో చేరిన ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న లాంటి నేతలు విమర్శించారు. వరుస పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలతో ఆదరణ పెంచుకుంటోన్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు ఇవ్వకపోవడాన్ని కారణంగా చూపిస్తూనూ కొందరు నేతలు కాంగ్రెస్ ను వీడుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా అండగా నిలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిజంగానే కొత్త పార్టీ పెడితే రేవంత్ లాంటి నేతలు అండగా నిలబడతారా, అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ దుస్థితిపై అసంతృప్తితో ఉండి, అటు టీఆర్ఎస్, బీజేపీలోకి పోలేక మదనపడుతోన్న ఎంతో మంది నేతలకు కొండా పార్టీ వేదికగా మారే అవకాశం లేకపోలేదు. దేశంలోనే అత్యంత ధనిక నేతల్లో ఒకరైన విశ్వేశ్వర్ రెడ్డికి పార్టీ నడిపే సత్తా లేదని చెప్పలేం. ఎటొచ్చీ ఆయనీ ప్రకటన సీరియస్ గా చేశారా, సరదాగా చేశారా అన్నది తేలాల్సి ఉంది.

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

English summary
Konda Vishweshwar Reddy, who belongs to a strong political family in Telangana, gave a hint on the formation of a new political party. The former Chevella MP, who QUITS Congress party on Sunday, wrote an open letter to his followers on Wednesday. ‘i'm taking concerns whether to start a new party? Or join another party? Or to be an Independent?' says Vishweshwar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X