హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఫ్ ఫెస్టివల్‌పై ఆగని రగడ: 'పశు మాంసం తినొచ్చు', మెనూ విడుదల చేసిన విద్యార్ధి సంఘాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతో పాటు చాలా మంది మేధావులు అన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలిపారు. నల్గొండ జిల్లా హోలియాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన సంఘం నియోజకవర్గ సదస్సులో ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా పశు మాంసం తినడం తప్పు కాదన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పాడి పరిశ్రమ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, మేధావులు బీఫ్ తిన్నవారేనని ఆయన పేర్కొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిని పండగలా నిర్వహించడం కంటే ఉద్యమంలా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పశు పరిశ్రమ అభివృద్ధికి ఓయూ విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారన్నారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

మరోవైపు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తామని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఫ్ ఫెస్టివల్‌‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని డీసీఎఫ్ తేల్చి చెప్పింది. మంగళవారం డీసీఎఫ్ మీడియాతో మాట్లాడారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఈ సందర్భంగా ‘బీఫ్ ఫెస్టివల్' పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఉస్మానియా వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్ నిర్వహించకూడదని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులు ఇంకా తమకు అందలేదని వెల్లడించారు. తీర్పు ప్రతుల కోసం 10వ తేదీ ఉదయం 10 గంటల దాకా ఎదురుచూస్తామన్నారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఇక ఈ సమయంలో బీఫ్ పెస్టివల్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10న జరిగే బీఫ్ ఫెస్టివల్‌కు అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే ప్రతిఒక్కరికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఒకవేళ అడ్డుకోవడం, దాడులకు పాల్పడితే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని డీసీఎఫ్ హెచ్చరించింది. మరోవైపు ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం అడ్డుకోకపోతే ట్యాంక్‌బండ్ గోశాల నుంచి వేలాది మందితో బైక్‌ర్యాలీగా తరలి వెళ్లి ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రగడ

మంగళవారం రాత్రి మంగళ్‌హాట్‌లోని శ్రీవైష్ణవ్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటైన గోరక్షా సంకల్ప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం యువకులతో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకొని తీరుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
DCF Announces we will conduct beef festival in osmania university at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X