• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ట్రిపుల్ మర్డర్స్: 'అపర్ణకు చిన్నప్పటి నుంచే మధు పరిచయం, లాడ్జిలో ఆత్మహత్యాయత్నం'

|

హైదరాబాద్: సంచలనం సృష్టించిన చందానగర్ ట్రిపుల్ మర్డర్ కేసుపై డీసీపీ విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ముగ్గురిని చంపిన తర్వాత నిందితుడు మధు ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

  ట్రిపుల్ మర్డర్స్: అనుమానం, రెండు పెళ్ళిళ్ళు, కారణాలెన్నో !

  భార్యకు తెలియకుండా మరొకరని పెళ్లి చేసుకున్న మధు గొడవలు చెలరేగడంతో రెండో భార్యను, కుమార్తెతోపాటు అత్తను చంపి పరారైన విషయం తెలిసిందే. ఇది సంచలనం రేపింది. ఈ సంఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసు విషయమై డీసీపీ మాట్లాడారు.

  ట్రిపుల్ మర్డర్స్: అపర్ణను వదిలేయమని యామిని, మరొకరితో సన్నిహితంగా.. సహజీవనంపై మధు ట్విస్ట్

  ఇద్దరు భార్యల మధ్య గొడవలే కారణం

  ఇద్దరు భార్యల మధ్య గొడవలే కారణం

  ఈ హత్యలకు ఇద్దరు భార్యల మధ్య గొడవలే కారణమని డీసీపీ తెలిపారు. అత్త, కుమార్తెను తొలుత హత్య చేశాడని, ఆ తర్వాత అపర్ణను రోకలి బండతో కొట్టి చంపేశాడని తెలిపారు. చంపేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు.

  లాడ్జిలో ఆత్మహత్యాయత్నం, చిన్నప్పటి నుంచే పరిచయం

  లాడ్జిలో ఆత్మహత్యాయత్నం, చిన్నప్పటి నుంచే పరిచయం

  నిందితుడు మధు పటాన్‌చెరులోని ఓ లాడ్జికి వెళ్లాడని డీసీపీ తెలిపారు. అక్కడ అతను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. మధు, అపర్ణలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని ఆయన తెలిపారు.

  సోమవారం ఉదయం వచ్చి చూడగా

  సోమవారం ఉదయం వచ్చి చూడగా

  వేముకుంటలోని అపార్టుమెంటులో జయలక్ష్మీ, ఆమె కూతురు అపర్ణ, మనమరాలు కార్తికేయి రెండు నెలలుగా ఉంటున్నారు. సోమవారం ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చి చూడగా వారి ఇంటికి బయటినుంచి తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. అతడు వెంటనే పైఅంతస్తులోని ఇంటి యజమానికి తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తాళం పగలగొట్టి చూడగా అపర్ణ వంట గదిలో రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. గదిలో మంచంపై జయలక్ష్మి, చిన్నారి కార్తికేయి మృతదేహాలు కనిపించాయి.

  కూతురు, కొడుకు

  కూతురు, కొడుకు

  అపర్ణ తలపై రోకలిబండ రాయితో మోది చంపగా మిగిలిన ఇద్దరిని గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జయలక్ష్మి, మురళి భార్యాభర్తలు. ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఉంటున్నారు. వారికి కుమార్తె అపర్ణ, కుమారుడు వంశీ ఉన్నారు. కొడుకు తాడేపల్లిగూడెంలో దుకాణం నడుపుతుంటాడు. కుమార్తె అపర్ణ ఇక్కడే ఓ షోరూంలో పని చేస్తోంది.

  తండ్రి నో చెబితే, తల్లి పెళ్లి జరిపించింది

  తండ్రి నో చెబితే, తల్లి పెళ్లి జరిపించింది

  వారు చందానగర్‌ వేంకుంటలోని ఓ అపార్టుమెంటు మొదటి అంతస్తులో రెండు నెలలుగా ఉంటున్నారు. అపర్ణకు పశ్చిమ గోదావరి జిల్లా ఉల్లంపర్రుకు చెందిన మధుతో పరిచయం ఉంది. అతడు కూడా చందానగర్‌కే వచ్చి స్థిరపడటంతో పరిచయం ప్రేమకు దారి తీసింది. అయితే అపర్ణ తండ్రి మురళి వారి పెళ్లికి నిరాకరించాడు. మధు వ్యవహారశైలి నచ్చకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల పెళ్లికి అడ్డు చెప్పాడు. అయితే ఆ తర్వాత మురళి చనిపోవడంతో తల్లి జయలక్ష్మి అపర్ణ, మధులకు పెళ్లి జరిపించింది.

  గొడవలు ఇలా

  గొడవలు ఇలా

  అయితే మధుకు అప్పటికే యామిని అనే మహిళతో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అపర్ణను రెండోపెళ్లి చేసుకుంటున్నట్లు ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో మొదటి భార్యతో కలిసి ఉంటూనే అడపాదడపా అపర్ణ దగ్గరకి వచ్చి వెళ్లేవాడు. మొబైల్‌ షాప్ నిర్వహిస్తూ చాటుమాటుగా ఇద్దరితోనూ కాపురం చేస్తూ వచ్చాడు. అపర్ణను పెళ్లి చేసుకున్న విషయం యామినికి తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె అపర్ణ ఉంటున్న ఇంటికి వచ్చి తరచూ గొడవపడేది. ఇంట్లో గొడవలు మధుకు చికాకుగా తయారయ్యాయి. అదేసమయంలో అపర్ణ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం రావడంతో మధు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

  English summary
  A mother, her daughter and granddaughter were found dead in their residence under suspicion circumstances on Monday at Serlingampalli, which is on the city suburbs. Cyberabad police suspects that it could be a case of murder.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X