హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయరాం హత్య కేసు: ఏపీ నేతలతో మాట్లాడిన రాకేష్‌రెడ్డి, మినిస్టర్ ఉన్నా వదిలేది లేదని డీసీపీ, శిఖా...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సినీ నటుడు సూర్య ప్రసాద్‌, కిశోర్‌తో పాటు స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు 90 శాతం పూర్తయిందని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. జయరాంను బెదిరించి డబ్బు వసూలు చేయాలనే రాకేష్ రెడ్డి కుట్ర పన్నాడన్నారు. సూర్య ప్రసాద్‌, కిశోర్‌... జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, హత్య అనంతరం అంజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లినట్టు తెలిపారు.

రాకేష్ రెడ్డి హత్య చేసిన విషయం తెలిసినా అంజిరెడ్డి చెప్పలేదని అన్నారు. జయరాంను బెదిరించి రాయించుకున్న పత్రాలు అంజిరెడ్డి వద్ద దాచాడన్నారు. హత్యతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదన్నారు. పోలీసుల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. రాకేష్ రెడ్డి ప్రగతి రిసార్ట్స్‌ యజమానులను బెదిరించాడన్నారు. రాకేష్ రెడ్డికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని, ఈ హత్య కేసులో నేతల ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు దొరకలేదన్నారు. కొద్ది రోజుల క్రితం జయరాం హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ మీడియాతో మాట్లాడారు.

'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?' 'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?'

రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి

రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి

రాకేష్ రెడ్డికి చాలామంది రాజకీయ నాయకులతో పరిచయం ఉన్నప్పటికీ ఈ కేసులో మాత్రం వారి పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలలేదన్నారు. తనకు పెద్దపెద్దవాళ్లు తెలుసునని చెప్పి బెదిరించి, పనులు చేయించుకున్నాడని చెప్పారు. ఆయన రాజకీయ నాయకులు, మంత్రుల పేర్లు వాడి బెదిరించాడని చెప్పారు. ఏపీకి చెందిన ఓ మంత్రికి రాకేష్ రెడ్డి నుంచి కాల్ వెళ్లిందని ప్రచారం సాగుతోందని ఓ విలేకరి ప్రశ్నించగా దానిపై విచారణ జరిపిస్తామన్నారు. అతను టీడీపీ, కాంగ్రెస్ నేతల పేర్లు ఉపయోగించుకున్నారని చెప్పారు. రాకేష్ రెడ్డి ఆ నేతల పేర్లు వాడినంత మాత్రాన ఆ పేర్లు చెప్పడం సరికాదని, ఎందుకంటే వారి పాత్ర ఉందని చెప్పలేమని అన్నారు. ఎవరినైనా భయపెట్టేందుకు కూడా అలా పేర్లు ఉపయోగించుకోవచ్చు కదా అన్నారు. అవతలి వాళ్లు తనకు పరిచయం అని రాకేష్ రెడ్డి చెప్పుకుంటాడని అన్నారు.

 ఏపీ టీడీపీ నేత పేరు బయపడలేదా అంటే

ఏపీ టీడీపీ నేత పేరు బయపడలేదా అంటే

రాకేష్ రెడ్డి కాల్ లిస్టులో తెలంగాణ పోలీసుల పాత్ర బయటపడినట్లుగా ఏపీ టీడీపీ నేత ఒకరి పేరు బయటపడలేదా అని ఓ విలేకరి ప్రశ్నించగా, అదేం లేదని, అలాంటివి ఉంటే చెబుతామని డీసీపీ తెలిపారు. తాము ఇంకా వెరిఫై చేస్తున్నామన్నారు. తాము అతని కాల్ లిస్టును వెరిఫై చేశామని, చాలామంది పేర్లు ఉన్నాయన్నారు. రాకేష్ రెడ్డి.. కొంతమంది మంత్రులకు, ఆ పార్టీ నేతలకు కాల్ చేశాడని చెప్పారు. కానీ హత్య చేసి, తనకు సాయం చేయమని మాత్రం చెప్పి ఉండడు కదా, కాబట్టి ఎందుకు కాల్ చేశాడనే విషయం తెలియాల్సి ఉందన్నారు. నేను హత్య చేశా.. నాకు సాయం చేయండి అని ఎవరు కూడా అడగరని డీసీపీ అన్నారు.

 టీడీపీలో కీలకంగా, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పించిన ప్రచారంపై

టీడీపీలో కీలకంగా, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పించిన ప్రచారంపై

రాకేష్ రెడ్డి టీడీపీలో కీలకంగా వ్యవహరించినట్లుగా, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇప్పించినట్లుగా ప్రచారం సాగుతుందని ఓ విలేకరి ప్రశ్నించగా.. డీసీపీ స్పందిస్తూ.. ఇతని (రాకేష్ రెడ్డి) చరిత్ర చూస్తే ఇతను చెప్తే ఎవరికైనా టిక్కెట్లు (ఎమ్మెల్యే) ఇస్తారని తాను అయితే అనుకోవడం లేదని డీసీపీ తెలిపారు. అతను అలా చెప్పుకొని ఉంటాడని అన్నారు. ఆ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. హత్య తర్వాత ఏ మంత్రులతో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారో వివరాలు వచ్చాక చెబుతామన్నారు. రాజకీయ నాయకులకు ఎందుకు ఫోన్ చేశాడంటే విచారణ జరిపి చెబుతామన్నారు.

పేర్లు చెప్పమని మీడియా అడగగా

పేర్లు చెప్పమని మీడియా అడగగా

హత్య తర్వాత పలువురు మంత్రులకు, నేతలకు ఫోన్లు చేసినట్లుగా చెబుతున్నారని, అలాంటప్పుడు వారి పేర్లు చెప్పవచ్చు కదా అని మీడియా ప్రశ్నించగా.. డీసీపీ స్పందిస్తూ.. రాజకీయ నాయకులకు సంబంధం లేకున్నా వారి పేర్లు చెప్పమంటారా అని ఎదురు ప్రశ్నించారు. ఈ కేసులో మంత్రి అయినా ఎలాంటి నాయకుడు అయినా ఉంటే వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. కానీ వారి (రాజకీయ నాయకులు) పాత్ర లేకుంటే వారి జోలికి వెళ్లమన్నారు.

 శిఖా చౌదరి పాత్ర తేలలేదు

శిఖా చౌదరి పాత్ర తేలలేదు

ఈ హత్యతో శిఖా చౌదరికి సంబంధం ఉన్నట్లుగా తేలలేదని డీసీపీ స్పష్టం చేశారు. ఆమె పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. జయరాం సతీమణి పద్మశ్రీ ఫిర్యాదు మేరకు తాము విచారణ చేస్తున్నామని తెలిపారు. పదిహేను రోజుల్లో ఈ కేసులో ఛార్జీషీట్‌ను ఫైల్ చేస్తామన్నారు. రాకేష్ రెడ్డిని మరోసారి పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని చెప్పారు. ఈ కేసు విచారణ 90 శాతం పూర్తయిందన్నారు.

హీరోయిన్‌కు బెదిరింపు

హీరోయిన్‌కు బెదిరింపు

సినిమా రంగానికి చెందిన హీరోయిన్‌ను కూడా రాకేష్ రెడ్డి బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయని మీడియా ప్రశ్నించింది. దీనిపై డీసీపీ మాట్లాడుతూ.. కొంతమంది సినిమా వ్యక్తులను బెదిరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయని, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే వచ్చి ఇస్తే విచారణ జరిపిస్తామన్నారు.

English summary
West Zone DCP on Thursday talk about NRI Jayaram murder case, TDP leaders and Shikha Chaudhary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X