వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొర్రెకుంట బావిలో 9 మందివి హత్యలే?: మిస్టరీ వీడింది, విచారణలో నిందితుడి నేరాంగీకారం

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట వద్ద బావిలో తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమైన కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో వారిది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. పోలీసుల విచారణలో నిందితులు నేరం అంగీకరించినట్లు తెలిసింది.

షాకింగ్: చెవిలో కాల్చుకున్న భర్త.. తలలోంచి వెళ్లి భార్య మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్!షాకింగ్: చెవిలో కాల్చుకున్న భర్త.. తలలోంచి వెళ్లి భార్య మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్!

అతడే హత్యలు చేశాడు..

అతడే హత్యలు చేశాడు..

హతురాలైన బుస్రా ప్రియుడు సంజయ్ కుమార్ యాదవ్ తన స్నేహితులతో కలిసి ఈ సామూహిక హత్యలకు పాల్పడినట్లు సమాచారం. కూల్ డ్రింక్స్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.

సంచలనంగా కేసు..

సంచలనంగా కేసు..

నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదట గురువారం నాలుగు మృతదేహాలు బావిలో తేలాయి. శుక్రవారం మరో ఐదు శవాలు బావిలో వెలుగు చూశాయి. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. దీంతో వరంగల్ పోలీసులు ఆరు బృందాలుగా రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు.

20ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి వచ్చి..

20ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి వచ్చి..

కాగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్ దాదాపు 20 ఏళ్ళ క్రితం కుటుంబంతోపాటు వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నాడు.

గోదాం వద్దే అందరూ..

గోదాం వద్దే అందరూ..

లాక్ డౌన్ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన బుస్రా(22) కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితోపాటు గోడౌన్ పక్కనే ఉన్న భవనంలో బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాం, పశ్చిమబెంగాల్ కు చెందిన షకీల్ లు కూడా నివసిస్తూ గోదాంలో ఉంటున్నారు.

Recommended Video

Telangana Budget 2020 : Will Budget Have Provision For Airport At Adilabad?
వివాహేతర సంబంధమే కారణమా?

వివాహేతర సంబంధమే కారణమా?

అయితే, భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బుస్రాకు తన తల్లితోనూ గొడవలు ఉన్నట్లు తెలిసింది. కాగా, బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాంలు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారమే ఈ 9 మందిని హత్య చేసినట్లు సమాచారం.

English summary
deaths in warangal well case: accused agreed his involvement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X