వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1969 నుంచి ఉద్యమాలేనాయే, రాత్రికి రాత్రేనా: సభలో కెసిఆర్ నిరాశ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో రైతు ఆత్మహత్యల పైన చర్చ అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు సమాధానం ఇచ్చారు. రైతు సమస్య తీవ్రమైందన్నారు. రైతుల ఆత్మహత్య పైన హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.

రెండు ప్రభుత్వాలు కూడా సమస్య మూలాల్లోకి వెళ్లి, కార్యాచరణ ఏమిటో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారని, దీనిని గౌరవంగా తాము స్వీకరిస్తున్నామని కెసిఆర్ చెప్పారు.

ఈ క్రమంలో సభ్యులు, వివిధ పార్టీల నుంచి ఆమూలాగ్రంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు, దీర్ఘకాలిక చర్యలు చేపట్టేందుకు చర్చను చేపట్టామని, కానీ తనకు ఈ విషయంలో నిరాశనే కలిగిందన్నారు. రైతు సమస్యల పైన ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానం రాలేదని, అది నిరాశనే కలిగించిందన్నారు.

Debate on farmer suicides: KCR speech in Assembly

కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదని, యావత్ భారత దేశంలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయన్నారు. మన పొరుగు రాష్ట్రంలోను ఆత్మహత్యలు ఉన్నాయన్నారు. పలు సంస్థలు, పత్రికలు ఆయా రాష్ట్రాల్లోని ఆత్మహత్యల వివరాలను వెల్లడిస్తున్నాయన్నారు.

ఇక్కడున్న సభ్యుల్లో ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచే వచ్చారన్నారు. తెలంగాణ ఆవిర్భవించి పదిహేను నెలలు పూర్తయి... పదహారో నెలలోకి అడుగు పెడుతోందన్నారు. 1969 నుంచి గత ఏడాది వరకు తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నామన్నారు. 1969 నుంచి 2014 వరకు ఉద్యమాలే అన్నారు.

ఇన్నాళ్లు మనం పోరాడింది.. నిధులు, నీళ్లు, నియామకాల గురించి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఉంది.. ఏం చేశారనే విషయం జోలికి వెళ్లదల్చుకోలేదన్నారు. కానీ, 58 ఏళ్ల పాలనలో తెలంగాణ భయంకర వివక్షకు గురైందన్నారు. తెలంగాణ సమాజం ఎందుకు రాష్ట్రాన్ని కోరుకుంటుందో ఎందరో వివరించారన్నారు.

Debate on farmer suicides: KCR speech in Assembly

పెరుగన్నం తినే రైతు నేనే రాశా...

పెరుగన్నం తినే రైతు.. పురుగుల మందు తాగుతున్నాడనే పాటను నేనే రాశానని చెప్పారు. దీనిని 2001లో రాశానని చెప్పారు. ఈ సమస్య ఒక్క రాత్రిలోనే పోదన్నారు. అలా చెబితే, పిచ్చి నమ్మకమే అవుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.

ప్రాజెక్టులు కట్టకపోవడం..

అనుకున్న ప్రాజెక్టులు కట్టకపోవడం, అడవులను నరికివేయడం తదితరాలు మన ఇప్పటి కష్టాలకు కారణమని చెప్పారు. వీటికి తోడు, మూలిగే నక్క పైన తాటికాయ పడినట్లు కరెంట్ బిల్లు మోతలు అన్నారు. ఒకప్పుడు ఏపీకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పేరుండేదన్నారు. అగ్రికల్చరల్ వర్సిటీని ధ్వంసం చేశారన్నారు.

ఐఆర్ 56ని ఒకప్పుడు రైతులు క్యూలో నిలబడి కొనుక్కునే వారని, ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాని ఊసు ఉందా అని ప్రశ్నించారు. నేను, వ్యక్తులను, పార్టీలను అనదల్చుకోలేదన్నారు. తాత్కాలిక ఉపశమనంతో ఆదుకోవడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు.

నేడు జరుగుతున్న ఈ మారణకాండకు ఏ ప్రభుత్వమో ఒక్కరోజు చేసిన తప్పు కాదన్నారు. నిరంతరం జరిగిన వివక్ష వల్లనే ఇది అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు వేల చెరువులు తవ్వించారన్నారు. వారు ఎప్పుడో శతాబ్దాల క్రితం కట్టించిన లక్నవరం, రామప్ప, ఘనపురం తదితర చెరువులు ఇప్పటికీ వేల ఎకరాలకు నీరు ఇస్తున్నాయన్నారు.

కాకతీయ రాజులు మనకు ఇచ్చిన సంపదను నాశనం చేశారన్నారు. ఆ తర్వాత కులీకుతుబ్ షాలు ఎంతో చేశారన్నారు. నిజాం నవాబుల కాలంలోను నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ ఉన్నాయన్నారు. నిజాం సాగర్ ప్రపంచంలోనే భారీ నీటి పారుదల ప్రాజెక్టు అన్నారు.

Debate on farmer suicides: KCR speech in Assembly

నిన్న ఎర్రబెల్లి ఓ మాట చెప్పారు...

నిన్న ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ... అవసరమైతే మిగతా వాటిలో పద్దుల్లో బడ్జెట్ తగ్గించి, వ్యవసాయ రంగానికి కేటాయించాలని చెప్పారని, దానిని స్వాగతిస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ... ఒక్కరోజులోనే ఆగిపోవాలంటే ఆగదన్నారు.

మన రైతాంగానికి ఏం భరోసా ఇవ్వాలో మన ముందున్న ప్రధాన అంశమన్నారు. దీని పైనే ప్రతిపక్షాల నుంచి సూచనలు వస్తాయని భావించానని, రాలేదన్నారు. విపక్షాలు ఎందుకు చెప్పలేదో, తాను కారణాలలోకి వెళ్లదల్చుకోలేదన్నారు. రైతు సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావన్నారు.

జానారెడ్డి కల్పించుకొని మాట్లాడుతూ.... ప్రశంసించిన కెసిఆర్

దీర్ఘకాలిక సూచనలు ఇవ్వలేదని చెప్పడం సరికాదని, తన వద్ద దీర్ఘకాలిక సూచనలు ఉన్నాయని ఇస్తామని చెప్పారు. దానికి కెసిఆర్ మాట్లాడుతూ.. జానా అనుభవజ్ఞులను, ఆయన చేయని పోర్ట్ ఫోలియో లేదని, ఆయన సూచనలు పాటిస్తామన్నారు. మీరు ఏం సూచన ఇచ్చినా తీసుకుంటామన్నారు.

30 ఏకరాల అల్లం పెట్టాను

నేను నా పొలంలో 30 ఎకరాల అల్లం పెట్టానని, నా పొలమే పండుతుందో లేదో అర్థం కావడం లేదన్నారు. తాను సమస్యలను ఇటీవల ఎర్రవెల్లి గ్రామస్తులతో పంచుకున్నానని చెప్పారు. ప్రస్తుతం యావత్ తెలంగాణ ఆకాశం వైపు చూసే పరిస్థితి ఉందన్నారు. కొన్ని చిన్న చిన్న ప్రాంతాలు మాత్రం మినహాయింపు అన్నారు.

భారత దేశంలో ఎక్కడ లేని విత్తన కంపెనీలు మన హైదరాబాదులో ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షం అన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతారనే ఉద్దేశ్యంతో మేం ఉన్నామన్నారు. అందుకే మేం అందరు మాట్లాడినవి నోట్ చేసుకున్నామని చెప్పారు.

364 విత్తన కంపెనీలు

ఓపెన్ మైండెడ్‌గా దీని పైన చర్చ జరగాలన్నారు. సమస్యకు మనం పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. భారత దేశంలోనే ఎక్కడా లేనన్ని కంపెనీలు.. 364 విత్తన కంపెనీలు హైదరాబాదులో ఉన్నాయని చెప్పారు. భారత దేశంలో సీడ్ కేపిటల్ ఏదంటే హైదరాబాద్ అని చెప్పే పరిస్థితి ఉందన్నారు.

ఒకేచోట గంటకు 650 మెట్రిక్ టన్నుల సీడ్ ప్రాసెస్ చేయగలిన సామర్థ్యం ప్రపంచంలోనే హైదరాబాదులో ఉందన్నారు. ఇక్కడ ఎంతోమంది పని చేస్తున్నారన్నారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాలో రైతుల ఆత్మహత్యలు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావన్నారు.

ఓ ఏడాది పూర్తి అయితే గానీ అంతా అర్థం కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు న్యాయం జరగదనే ఉద్దేశ్యంతోనే ప్రజలు రాష్ట్రం కోరుకున్నారన్నారు. నేను మలి దశ ఉద్యమం ప్రారంభించానన్నారు. ప్రజల పోరాటం ఫలించి తెలంగాణ వచ్చిందన్నారు. మేం అధికారంలోకి వచ్చి కేవలం పదిహేను నెలలే అవుతుందన్నారు.

హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సిఆర్ రెడ్డి వంటి గొప్ప ఆర్థిక మేధావినవి ప్రభుత్వానికి ఫైనాన్స్ మేనేజర్‌గా పెట్టుకున్నామన్నారు. బడ్జెట్ విషయంలో మేం ఎక్సర్‌సైజ్ చేస్తున్నామన్నారు.

విభజన సమయంలో అధికారుల విభజన తదితర గందరగోళం జరిగిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులకే ఏడెనిమిది నెలలు గడిచిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం బడ్జెట్ ప్రవేశ పెట్టామన్నారు. ఒక రాష్ట్రం ఏర్పడ్డాక... ఓ ఏడాది పూర్తి అయితే గానీ పూర్తిగా అర్థం కాదన్నారు.

మేం శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారుల సహకారాలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల అనుభవాలు తీసుకుంటున్నామన్నారు. మన వద్ద మంచి భూములు ఉన్నాయని తనకు చెప్పారని, వాటిని బాగా ఉపయోగించుకుంటే రైతులు లక్షాధికారులు అవుతారని చెప్పారన్నారు.

రైతులకు ఇప్పటికి ఇప్పుడు ఉన్న కష్టం విద్యుత్ అన్నారు. దానిని అధిగమించామని చెప్పారు. ఏపీ ఇవ్వకపోవడంతో... మేం ప్రత్యామ్నాయాల ద్వారా కొన్నామని చెప్పారు. చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు.

కట్టెపోలుతో వెయ్యివాట్ల విద్యుత్ తెస్తామా

నిన్న ఎర్రబెల్లి మాట్లాడుతూ... కట్టెపోలుతో నేను వెయ్యివాట్ల విద్యుత్ తెస్తానని చెప్పినట్లు అన్నారని, అలా ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారా అన్నారు. అది ఎవరికైనా సాధ్యమవుతుందా అన్నారు.

దేశంలో రెండున్నర లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, కేవలం లక్షకు పైగానే ఉపయోగిస్తున్నామన్నారు. అయినప్పటికీ చాలా రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ఉన్నాయన్నారు. మనకు ఎంత విద్యుత్ కావాలంటే అంత విద్యుత్ చత్తీస్ గఢ్ నుంచి కొనుక్కోవచ్చునని చెప్పారు.

Debate on farmer suicides: KCR speech in Assembly

మొదటిసారి విద్యుత్ కష్టాలు లేకుండా సభ

గత ముప్పయ్యేళ్లుగా నేను శాసన సభలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఉన్నానని చెప్పారు. ఏ శాసన సభలో అయినా కందిళ్లు, కరెంట్ కోతల వల్ల ఎండిపోయిన పంటలు పట్టుకు రావడం ఎన్నోసార్లు జరిగిందన్నారు. కానీ మొట్టమొదటిసారి విద్యుత్ కోతలు, విద్యుత్ కష్టాలు లేకుండా సభ జరుగుతోందన్నారు.

రైతులకు ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పామో, దానిని తప్పకుండా ఇస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో తుపాకీల మోత కూడా గతంలో విన్నామని చెప్పారు. కానీ ఇప్పుడు కరెంట్ కష్టాలు తగ్గాయన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని, మీ అభివృద్ధిని కాంక్షించి.. వచ్చే మార్చి తర్వాత నాటికి ఉదయం పూట విద్యుత్ తప్పకుండా ఇస్తామని చెప్పారు. 2018 నాటికి 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు.

రైతు సోదరులకు విజ్ఞప్తి...

రైతు సోదరులకు మనవి చేస్తున్నానని, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. మీరు ఇచ్చిన అధికారంతో మేం మీ కోసం పని చేస్తున్నామని చెప్పారు. దయచేసి ఆత్మహత్య వద్దన్నారు. ఇక నుంచి కరెంట్ కోతలు మన తెలంగాణలో ఉండవని రైతులకు హామీ ఇస్తున్నానని చెప్పారు.

పదహారు నెలల్లో ఏం చేశామంటే ఇది చేశామన్నారు. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా చేశామని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో కాకతీయ రెడ్డి రాజులు తవ్వించిన చెరువులు సర్వనాశనం అయ్యాయన్నారు. పోగా మిగిలిన వాటిని పునరుద్ధరించుకుందామన్నారు. అందుకే గుర్తించిన 46,500 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, వాటికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టామన్నారు.

వినే సంస్కారం లేకుంటే ఎలా

మాట్లాడుతుండగా.. ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేయగా, మీరు నిన్న మాట్లాడుతుంటే నేను ఒక్క మాట మాట్లాడలేదన్నారు. వినే ఓపిక లేకుంటే ఎలా అన్నారు. ప్రజలు లైవ్ చూస్తున్నారని, నేను తప్పు మాట్లాడితే కర్రు కాల్చి ప్రజలు వాత పెడతారన్నారు.

వాటర్ మెన్ ఆఫ్ ఇండియా పేరుగాంచిన రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి.. ఇటీవల తాము చేపడుతున్న మంచి పనులు చూసి వరంగల్ జిల్లాకు వచ్చి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని చెప్పారు. ఎందరో గుర్తించారు కానీ, విపక్షాలు మాత్రం గుర్తించడం లేదన్నారు.

English summary
Debate on farmer suicides: KCR speech in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X