వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 9.. తెలంగాణా చరిత్రను మార్చిన రోజే బీఆర్ఎస్ ఆవిర్భావం; కేసీఆర్ కు కలిసొస్తుందా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ కు డిసెంబర్ 9 సెంటిమెంట్ కలిసొస్తుందా? గతంలో తెలంగాణా చరిత్రను మలుపు తిప్పిన రోజే కెసిఆర్ నేడు బీఆర్ఎస్ పార్టీని ఘనంగా ఆవిర్భవించడం జాతీయంగా బి ఆర్ ఎస్ కు గుర్తింపు తెస్తుందా? అప్పుడు తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన కేసీఆర్, ఇప్పుడు దేశ చరిత్రను మలుపు తిప్పడం లో కెసిఆర్ కీలక భూమిక పోషిస్తారా? అంటే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతుంది.

కేసీఆర్ కు డిసెంబర్ 9 సెంటిమెంట్

కేసీఆర్ కు డిసెంబర్ 9 సెంటిమెంట్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు డిసెంబర్ 9 సెంటిమెంట్ కలిసి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కెసిఆర్ సాగించిన ఉద్యమంలో నవంబరు 29వ తేదీన కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన కెసిఆర్ డిసెంబర్ 9 వ తేదీ నాటికి 11 రోజుల పాటు దీక్ష చేశారు. అప్పటికే కెసిఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయనను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష సెగ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది.

డిసెంబర్ 9 నే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన

డిసెంబర్ 9 నే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటన

విపక్షాలు కెసిఆర్ ఆరోగ్యం విషయంలో అధికార పక్షంపై ఒత్తిడి తీసుకు రావడం ప్రారంభించాయి. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి పై పార్లమెంటులో కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఏం చేద్దామన్న దానిపై డిసెంబర్ 9 న కోర్ కమిటీ రోజంతా మూడుసార్లు సమావేశమై చివరిగా నాలుగోసారి భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని తేల్చింది. ఈ మేరకు రాత్రి 11. 30 నిముషాల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు నాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం నోటి నుండి ప్రకటన వచ్చింది.

తెలంగాణా చరిత్రను మార్చి, కేసీఆర్ ఇమేజ్ పెరిగిన రోజే .. బీఆర్ఎస్ ఆవిర్భావం

తెలంగాణా చరిత్రను మార్చి, కేసీఆర్ ఇమేజ్ పెరిగిన రోజే .. బీఆర్ఎస్ ఆవిర్భావం

దీంతో ఒక్కసారిగా కెసిఆర్ ఇమేజ్ పెరిగిపోయింది. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినట్టు అందరూ కేసీఆర్ ను నెత్తికి ఎత్తుకున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను డిసెంబర్ 9 కీలక మలుపు తిప్పింది. ఇక యాదృచ్చికంగా డిసెంబర్ 9నే మళ్లీ కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని చేస్తూ ఉండటం తెలంగాణ రాజకీయాలలో, ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. టిఆర్ఎస్ పార్టీని, జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా మార్చడానికి అనుమతినిస్తూ ఈసీ ప్రకటన విడుదల చేయడంతో నేడు మధ్యాహ్నం 1:20 కు జాతీయ పార్టీగా బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

బీఆర్ఎస్.. దేశ రాజకీయాలను మారుస్తుందా?

బీఆర్ఎస్.. దేశ రాజకీయాలను మారుస్తుందా?

అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన డిసెంబర్ 9 నాడే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరగనుండటం దేశ రాజకీయాలను మారుస్తుందా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. డిసెంబర్ 9 సెంటిమెంట్ కెసిఆర్ కు ఎంతమేరకు కలిసి వస్తుంది అన్నది అందరూ చర్చిస్తున్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీతో తలపడాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్, ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరుగుతున్న డిసెంబర్ 9 జాతీయ రాజకీయాలను మలుపు తిప్పగలుగుతుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

English summary
December 9 .. The establishment of BRS will happen today on the day that changed the history of Telangana. The debate on whether the sentiment of December 9 give success to KCR in national politics has become interesting. డిసెంబర్ 9 ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X