వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నాయకులపై పరువు నష్టం దావా వేస్తా ..కేటీఆర్

|
Google Oneindia TeluguNews

ఇంటర్ బోర్డు తప్పిదాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టకేలకు స్పందించారు. తనకు గ్లోబరీనా సంస్థకు ఎలాంటీ సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షపార్టీలకు ఆయన సూచించారు. తనపై ఆరోపణలు ఆపకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోంది

కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోంది

కాంగ్రెస్ తనపై చేస్తున్న ఆరోపణలు ఆపకపోతే పరువు నష్టం దావా వేయాల్సివస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. 4 కోట్ల 30 లక్షల రుపాయల కాంట్రాక్టులో పదివేల కోట్ల రుపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇంటర్ బోర్డులో తప్పులు జరిగిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని ,ఈనేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయోషన్ చేయిస్తున్నారని అన్నారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు తాము సంయమనం పాటిస్తున్నామని అన్నారు. విద్యార్థులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. కాగా రాజకీయ పార్టీలు పిల్లల ప్రాణాలతో చలగాటం అడద్దోని విజ్ఝప్తి చేశారు.

ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి

ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీు చిల్లర రాజకీయాలు, చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టేందుకు అస్త్రాలు లేకపోవడంతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు గ్లోబరీనా సంస్థ ఎవరో తెలియదని చెప్పినా వినడం లేదని ,అయినా, నాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మరో వైపు రాజకీయంగా పోరాడేందుకు చాల సమస్యలు ఉన్నాయని ,దయచేసి విద్యార్థుల సమస్యను రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు. ఇదే అంశంపై కోర్టులో విచారణ జరుగుతుందని , దోషులు ఎవరు తేలిన వారిని ముందుగా శిక్షించమని నేనే ముందుగా కోరడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి , ఎమ్మెల్యే బాల్క సుమన్

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి , ఎమ్మెల్యే బాల్క సుమన్

కాగా ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి పదివేల కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.ఇది కేటీఆర్ కు సంబంధం ఉందని ఆయన చెప్పారు. దీంతో రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లో కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్ఎస్ శ్రేణుల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

English summary
The TRS party working president ktr has finally responded on the inter board , He once again made it clear that he had nothing to do with Globerina. He advised opposition parties not to politicize students' content. and if the congress party will not stop the allegations against him the defamation case will be filed ,ktr warned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X