హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోదుస్తుల్లో సెల్‌ఫోన్, డిగ్రీ పరీక్షల్లో హైటెక్ కాపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోదుస్తుల్లో సెల్‌ఫోన్ పెట్టుకొని, హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని మలక్ పేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాపీకి పాల్పడుతూ అరెస్టైన అతను డిగ్రీ విద్యార్థి. ముంతాజ్‌ కళాశాలకు చెందిన అబ్దుల్‌ బారీ ఖయ్యూం బీకాం మూడో సంవత్సరం చదువుతున్నాడు.

మొదటి సంవత్సరం ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో పరీక్షకు హాజరయ్యాడు. లోదుస్తుల్లో సెల్‌ఫోన్ ఉంచుకొని, వైర్ల ద్వారా చెవుల వద్ద బిగించుకున్నాడు. బయటి నుంచి చెబుతున్న సమాధానారు రాశాడు. తనిఖీ చేయగా అది బయటపడింది.

Degree student held for hi tech copying with cell phone

నిర్మాతకు తెలియకుండా సినిమా అమ్మిన డైరెక్టర్

పెట్టుబడి పెట్టి నిర్మాత సినిమా తీస్తే, దర్శకుడు నిర్మాత సంతకం ఫోర్జరీ చేసి సినిమా హక్కులను విక్రయించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. జరిగిన అన్యాయాన్ని గుర్తించిన నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుడైన దర్శకుడిని అరెస్టు చేశారు.

అమీర్‌పేటలో నివాసం ఉండే రామారావు అనే సినీ నిర్మాత మహంతి పద్మారావు(35) అలియాస్‌ మహంతి పికె దర్శకత్వంలో కొంతకాలం కిందట 'అమ్మాయిలు టేక్‌కేర్' అనే సినిమాను నిర్మించారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్కు కోసం ఫిలిం నగర్‌లోని ఓ ల్యాబ్‌కి పంపించారు.

Degree student held for hi tech copying with cell phone

ఈ సమయంలో మహంతి పద్మారావు..య నిర్మాత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ సినిమా హక్కుల్ని సతీష్‌ చౌదరి అనే వ్యక్తికి ఇచ్చారు. ఈ చిత్రం 'పేరునూ వాడు వీడు ఓ కల్పన'గా మార్చారు. దీని ఆడియో ఈ నెల 10న విడుదల చేయడంతో విషయం తెలుసుకున్న జానా రామారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు దర్శకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

English summary
Degree student held for hi tech copying with cell phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X