హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య, కల్తీ కల్లు దొరక్క పురుగుల మందు తాగాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ పట్టణంలో డిగ్రీ విద్యార్థి భరత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరుగుల మందు తాగిన భరత్ రెడ్డిని అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడు మహబూబ్‌నగర్‌ జిల్లా కుందుర్గు మండలం రేగడి చిలకమర్రి వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Degree student suicide attempt in vikarabad

గాంధీ ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తి అనుమాదాస్పదంగా మృతి చెందాడు. సూపరిటెండెంట్ గది వద్ద నాలాలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

రైతు ఆత్మహత్య

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని ఉలిచరాలతండాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ రైతు విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు పేరు హరి (30). 10 ఎకరాల్లో పత్తిపంట సాగు చేసిన హరి వర్షాలు పడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. పత్తిపంట సాగుకోసం రూ.4లక్షలు అప్పు చేసినట్లు హరి కుటుంబ సభ్యులు తెలిపారు.

కల్తీ కల్లు దొరకలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య

తెలంగాణలో కల్తీకల్లు మరణాలు మరితంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మత్తు మందు కలిపిన కల్తీ కల్లుకు లక్షలాది మంది బానిసలయ్యారు. ఈ క్రమంలో, కల్తీ కల్లు తాగి మరణించే వారు కొందరైతే, కల్తీ కల్లు దొరక్క పిచ్చివారవుతుంటే, మరికొంత మంది చనిపోతున్నారు.

తాజాగా మత్తుమందు కలిపిన కల్లు దొరక్క పోవడంతో మెదక్ జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లిలో రాములు (52) అనే వ్యక్తి చనిపోయాడు. మరోవైపు, సదాశివపేట మండలం నందికంటిలో కల్తీకల్లు దొరకలేదని పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబ్‌నగర్‌ జిల్లా హాజీపల్లి రోడ్డులో కల్తీకల్లు దొరక్క మహిళ మృతి చెందింది. కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో మహాలక్ష్మీనగర్‌లో కల్తీకల్లు దొరక్క మొయినుద్దీన్‌ అనే రిక్షా కార్మికుడు మృతి చెందాడు.

English summary
Degree student suicide attempt in vikarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X