వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లపై మంత్రి కేటీఆర్ ట్వీట్: తెలంగాణలో జరిగితే స్పందించలేదే? అంటూ నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గత మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో ఇప్పటికి 24 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఢిల్లీ అల్లర్లపై కేటీఆర్..


దేశ రాజధానిలో చోటు చేసుకున్న హింస బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. భారతీయులు చాలా సున్నితంగా మారుతున్నారడానికి, మన దేశం ఎంత దుర్భలమైందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని వ్యాఖ్యానించారు. భారత ప్రతిష్టకు ముప్పు ఏర్పడిందని అన్నారు. ప్రపంచం మనల్ని గమనిస్తోందని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం అభిప్రాయబేధాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన..


అయితే, కేటీఆర్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. కేటీఆర్, టీఆర్ఎస్ మద్దతుదారులు సానుకూలంగా స్పందిస్తుండగా.. బీజేపీ సానుభూతిపరులు, ఇతర నెటిజన్లు మాత్రం కేటీఆర్‌ను ఇరకాటంలో పెట్టేలే వ్యాఖ్యలు చేస్తున్నారు. అల్లర్లను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందని.. కేసీఆర్ ప్రధాని అయితే దేశం అభివృద్ధి చెందుతుందని ఓ టీఆర్ఎస్ అభిమాని వ్యాఖ్యానించారు.

భైంసాపై ఎప్పుడు స్పందిస్తారు?

ఇక బీజేపీ మద్దతుదారులు, ఇతర నెటిజన్లు కేటీఆర్ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్.. మన తెలంగాణలోని భైంసాలో జరిగిన అల్లర్లపై ఎప్పుడు స్పందిస్తారు సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘మీ నాన్న పరిపాలించే రాష్ట్రం కాబట్టి భైంసా గురించి స్పందించే తీరిక లేదు కానీ.. ఢిల్లీ విషయమై స్పందించడానికి సమయం ఉంది ఎందుకంటే ఇది మీ నాన్న పాలించే రాష్ట్రం కాదు' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఓ ట్వీట్ భైంసా ఘటనపైనా చేస్తే బాగుండేదని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Recommended Video

#HappyBirthdayKCR: Gajwel People Gift To CM KCR | Oneindia Telugu

భైంసా భారతదేశంలో లేదా?

‘ముందు మన తెలంగాణలో ఉన్న భైంసాలో జరిగిన అల్లర్ల మీద స్పందించండి.. డిల్లీ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మరి బైంసా సంగతి ఎంటి సార్ మీరు ఇప్పటి వరకు వాళ్ళని పరామర్శించలేదు వారికి ఆర్థికంగా ఎలాంటి సహాయం చేరలేదు. వారికి అండగా ఎలాంటి ధైర్యం చెప్పలేదు.. బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ...
బైంసా లో అల్లర్లు జరిగిన కొద్దిరోజులలోనే నిందితులను గుర్తించి రిమాండ్ కి పంపింది తెలంగాణ ప్రభుత్వం.. అయినా బైంసా రాజధాని కాదు అందులోనూ జరిగింది విధీ గొడవ...ఢిల్లీ మన దేశరాజధాని... జరుగుతున్న విధ్వంసం మన దేశానికే ప్రమాదం
సర్ నమస్తే...పార్టీ పరంగా కాకుండా ఒక దేశ పౌరుడిలా చెప్పండి..CAA తీసుకురావడం తప్పా...ఓటు బ్యాంకింగ్ గురుంచి ఆలోచించకండి...మేధావులు కూడా నిజం చెప్పుకుంటే ఎలా సర్...ఢిల్లీ లో హింస గురుంచి మాట్లాడుతున్నారు...భైంసా భారత దేశంలో లేదా....' అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

English summary
Telangana Rashtra Samithi (TRS) Working President KT Rama Rao on Tuesday said that the ongoing violence in Delhi is a painful reminder of how hypersensitive and vulnerable India is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X