వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న‌గ‌రంలో డెలివ‌రీ బాయ్స్ ఉద్యోగం..! ఎంతో ద‌య‌నీయం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: డెలివ‌రీ బాయ్స్..! వీళ్ల‌నే మ‌రో భాష‌లో రైడ‌ర్స్ అని కూడా అంటారు. ఫోన్‌ కొట్టినా, ఆన్‌ లైన్లో ఓ క్లిక్కు పెట్టినా క్ష‌ణాల్లో ఇంటి ముందు డోర్‌ తట్టి చిటికెలో ఆర్డ‌ర్ అందిస్తారు. మ‌ట‌న్ క‌ర్రీ నుంచి అత్య‌వ‌స‌ర మెడిసిన్ల తో పాటు ఇంటికి అవసరమైన వస్తువులన్నింటిని తమ భుజాన మోసుకుని మోయలేని భారంతో కాలింగ్ బెల్ నొక్కుతారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా వీధివీధికి ఇంటింటికి కావాల్సిన ఆర్డ‌ర్ ను అందిస్తారు. గడప దాటకుండానే అందరి అవసరాలు తీరుస్తారు. కావాల్సినవన్నీ వారి ముంగిటకు చేరుస్తారు. ఇంతగా శ్రమించినా వారి ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. వారు సంపాదించేది నామ మాత్ర‌మే. మహానగరంలో నిశాచరుల్లా సంచరిస్తూ పొట్ట కూటి కోసం ఎన్నో తిప్పలు పడుతున్న డెలీవరీ బాయ్స్ పై ప్ర‌త్యేక క‌థ‌నం..!

 ఆర్థిక ఇబ్బందులు..!కుటుంబ పోష‌ణ‌..! డెలివ‌రీ బాయ్స్ అవ‌తారం ఎత్తుతున్నయువ‌త‌..!!

ఆర్థిక ఇబ్బందులు..!కుటుంబ పోష‌ణ‌..! డెలివ‌రీ బాయ్స్ అవ‌తారం ఎత్తుతున్నయువ‌త‌..!!

ఉన్నత చదువులు చదువుకోవాల్సిన యువకులు.అనుకోని ప‌రిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో తల్లిదండ్రులకు తోడుగా కుటుంబ పోషణ‌కు తమ వంతు సహకారం అందించడం కోసం కొందరు,నగరానికి వచ్చి ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ అలా వచ్చిన డబ్బులతో చదువుకోవడానికి మరి కొందరు డెలివరీ బాయ్స్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. నగరంలో ఇలా వెళ్లి అలా ఓ పని చేసుకుని రావలంటే గంటల తరబడి వ్యయప్రయాసలకు లోను కావాలి. ఓ అరగంట నగరంలో బయటకు వెళ్లి వస్తే చాలు పడే అలసట అంతా ఇంతా కాదు. అలాంటింది వీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో బరువును తమ భుజాల మీద వేసుకుని ఎంతో స‌హ‌నంతో ఇంటింటికి తిరిగి ఆర్డర్ లు చేర‌వేస్తుంటారు.

 ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అసలైన పాత్ర వీరిదే..!అట్లకాడ నుండి అంత‌ర్జాతీయ నౌకను కూడా మోసుకొస్తారు..!

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అసలైన పాత్ర వీరిదే..!అట్లకాడ నుండి అంత‌ర్జాతీయ నౌకను కూడా మోసుకొస్తారు..!

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అసలైన పాత్ర పోషించేది డెలివరీ బాయ్స్ మాత్ర‌మే. ఏమూలన ఉన్నా ఫోన్‌ చేసి అడ్రస్‌ తెలుసుకుని వారి ఇంటికి ఆర్డర్ ఇస్తుంటారు. నగరంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఏజెన్సీలు అనేకం వెలిసాయి. అమెజాన్‌.కామ్‌, ఫ్లిప్‌ కార్ట్‌, ఎకార్ట్‌.కామ్‌, ఆస్క్‌మి, బజార్‌.కామ్‌, స్టైలిష్‌మోబైల్‌.కామ్‌, మై మెడిసిన్.కామ్ ఇలా పదులు సంఖ్యలో వెలసిన ఆన్‌లై న్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌ వారి సొంతంగా కొరియర్‌ వ్యవస్థను ఏర్పాటు చే సుకున్నాయి. వీటిలో వందల సంఖ్యలో డెలివరీ బాయ్స్ ఉన్నారు. వీరం దరిని రెగ్యులర్‌గా కాకుండా పార్ట్‌టైం పద్దతిలో నియమించుకుంటాయి.

ఆదాయం చాలా త‌క్కువ‌..! కానీ త‌ప్ప‌ని ఉద్యోగం..!!

ఆదాయం చాలా త‌క్కువ‌..! కానీ త‌ప్ప‌ని ఉద్యోగం..!!

వీరికి కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన ఎలాంటి బెనిఫిట్స్‌ ఉండవు. ఉద్యోగ భద్రతా ఉండదు. ఇవే కాక నగరంలోని ప్రముఖ షాపింగ్‌ మాళ్ల్లు, సూపర్‌ బజార్లు, హౌటళ్లు, రెస్టారెంట్లు ఇలా ఎన్నో కూడా డోర్‌ డె లివరీ పద్దతిని పాటిస్తున్నాయి. వీరికి ఫోన్‌ చేసి ఆర్డర్‌ చేస్తే వాటిని తమ డెలివరీ బాయ్స్ ద్వారా ఇంటికి పంపిస్తారు. ఇదంతా నగరవాసికి సుఖాన్ని తెచ్చిపెట్టినా, వ్యాపారికి లాభాలు ఆర్జించి పెట్టినా ఈ వ్యాపారంలో అత్యంత కీలకమైన భాద్య తలను మోస్తున్న డెలివరీ బాయ్స్ కు మాత్రం కనీస వేతనం లభించడం లేదు. చాలా వ‌ర‌కు డెలివ‌రీ బాయ్స్ కి ఆర్డ‌ర్ ప్ర‌కారం వ‌చ్చే ఆదాయం మీద ప‌ర్సెంటేజ్ మాత్ర‌మే ఇస్తారు. ఎన్ని ఆర్డ‌ర్లు ఎక్కువ డెలివ‌రీ చేస్తే అంత ఎక్కువ ఆదాయం అని ఆశ చూపిస్తారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డెలివరీ బాయ్స్ ఎక్కువ ఆర్డ‌ర్స్ ని అందించేందుకు ముందుకు వ‌స్తారు.

 ఏమ‌రుపాటుగా ఉంటే అంతే..! కంపెనీకి పంగ‌నామం పెట్టే డెలివరీ బాయ్స్ కూడా ఉంటారు..!!

ఏమ‌రుపాటుగా ఉంటే అంతే..! కంపెనీకి పంగ‌నామం పెట్టే డెలివరీ బాయ్స్ కూడా ఉంటారు..!!

డెలివరీ బాయ్స్ తిరిగే ఏరియాను బట్టి వారికి ఆర్డ‌ర్స్ ఇస్తుంటాయి. డెలివరీ బాయ్స్ వారు తిరిగి సరుకులు చేరవేసేందుకు కొందరు వాహనాన్ని, దానిలో ఇంధనాన్ని సమకూర్చుతారు. మరి కొన్ని సంస్థలు సొంత బండి ఉంటే పెట్రోల్ అల‌వెన్స్ స‌మకూరుస్తారు. ఈ మొత్తం కూడా రోజువారి కాకుండా 15రోజుల కొకసారి అల వెన్సుల రూపంలో ఇస్తారు. ఒక్కోసారి కొంత‌మంది డెలివరీ బాయ్స్ కంనెనీల‌ను మోసం చేసే సంద‌ర్బాలు కూడా లేక‌పోలేదు. చిక్కంతా సీఓడీ (క్యాష్ ఆన్ డెలివ‌రీ) ప‌ద్ద‌తి ద్వారానే వ‌స్తుంది. ఆర్డ‌ర్ చేసేవాళ్లు పేటీయం, కంపెనీ ఎకౌంట్ లో డ‌బ్బులు జ‌మ‌చేస్తే స‌మ‌స్య ఉండ‌దు గానీ ఆర్డ‌ర్ డ‌బ్బులు నేరుగా డెలివరీ బాయ్స్ చేతికి ఇస్తేనే స‌మ‌స్య‌. కొంత‌మంది డెలివరీ బాయ్స్ తో ఎంట్రీ మేనేజ‌ర్ లాలూచీ ప‌డితే కంపెనీకి పెద్ద‌యెత్తున న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయి. అలా జ‌రిగిన సంద‌ర్బాలు కూడా జంట‌న‌గ‌రాల్లో కోకొల్ల‌లు ఉన్నాయి. ఏదేమైనా జంట న‌గారాల్లో కొత్త‌గా పుట్టుకొచ్చిన డెలివ‌రీ బాయ్స్ ఉద్యోగాలు మాత్రం అంత ఆశాజ‌న‌కంగా లేవ‌ని చెప్పొచ్చు.

English summary
Delivery boys culture came into twin cities,but now proper income for the boys. they have to work on percentage basis. many boys are coming to this field due to family responsibility and economical problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X