వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహితీవేత్త సి నారాయణ రెడ్డి మృతిపై ప్రధాని మోడీ ట్వీట్

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సాహిత్య ప్ర‌పంచానికి తీర‌నిలోట‌ు అని పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సాహిత్య ప్ర‌పంచానికి తీర‌నిలోట‌ు అని పేర్కొన్నారు.

ఈ మేరకు మోడీ పేరిట పీఎంవో ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశారు. సినారె కుటుంబ స‌భ్యుల‌కు తాను ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు మోడీ చెప్పారు.

ప్రముఖ సాహితీవేత్త సి నారాయణ రెడ్డి కన్నుమూత, సినారె ప్రస్థానంప్రముఖ సాహితీవేత్త సి నారాయణ రెడ్డి కన్నుమూత, సినారె ప్రస్థానం

ఆయ‌న సాహిత్యంలో చేసిన కృషి న‌వత‌రానికి ఆద‌ర్శ‌మ‌ని చెప్పారు. సి నారాయణ రెడ్డి మృతి పట్ల అన్ని రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సినారె మృతి పట్ల తెలుగు అగ్రహీరోలు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. సినారె సేవలను కొనియాడుతూ.. ఆ మహోన్నత సాహితీ శిఖరంతో తమకు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్‌లోని పుప్పాలగూడ డాలర్స్‌ హిల్స్‌లోని స్వగృహంలో సినారె భౌతికకాయానికి పలువురు సాహితీ ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌ మహాప్రస్థానం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు.

English summary
'Demise of Shri C Narayana Reddy is a major loss to the literary world. His works struck a chord with people across generations' tweeted PMO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X