వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత సచివాలయం కూల్చివేత .. మార్గాలు మూసివేత .. కొత్త సచివాలయం కోసం కేసీఆర్ అనుకున్నదే !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. పాత సచివాలయం కూల్చివేత పనులు మంగళవారం ఉదయం మొదలుపెట్టారు. మొదటి సి బ్లాక్ ను జెసిబి లతో కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

చీఫ్ సెక్రటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు .. రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబుచీఫ్ సెక్రటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు .. రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబు

 సచివాలయం వైపు వెళ్ళే మార్గాలు మూసివేత .. మొదలైన కూల్చివేత

సచివాలయం వైపు వెళ్ళే మార్గాలు మూసివేత .. మొదలైన కూల్చివేత

ఈరోజు తెల్లవారుజాము నుండి భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు మూసివేశారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం ప్రస్తుత పాత శివాలయం భవనాన్ని కూల్చివేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సి బ్లాక్ ను భారీ యంత్రాలతో కూల్చి వేస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతను సి ఎస్, డిజిపి మరియు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

క్రమపద్దతిలో కూల్చివేత పనులు

క్రమపద్దతిలో కూల్చివేత పనులు

పాత సచివాలయం స్థానంలో టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటేరియట్ ,అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఈ నేపధ్యంలో పాత భవనాల కూల్చివేత మొదలైంది . కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో కూల్చివేత చెయ్యాలని గతంలో అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్‌ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేలుడు పదార్ధాలను ఉపయోగించి ఒక క్రమ పద్దతిలో బ్లాస్టింగ్ చేసి పాత సచివాలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు ఒక క్రమపద్దతిలో కూల్చివేత పనులు మొదలు పెట్టారు.

Recommended Video

#WhereisKcr : KCR ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన.. కన్ఫ్యూజన్ లో నెటిజన్స్! || Oneindia Telugu
 కేసీఆర్ అనుకున్నదే .. కొత్త సచివాలయం కోసం మొదలైన కూల్చివేత

కేసీఆర్ అనుకున్నదే .. కొత్త సచివాలయం కోసం మొదలైన కూల్చివేత

పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన తెలంగాణ సర్కార్ అందుకోసం సచివాలయాన్ని ఖాళీ చేసి అక్కడ నుండి తరలించిన విషయం తెలిసిందే. సచివాలయ కార్యాలయాలను బి ఆర్ కే భవన్ కు తరలించారు. అయితే సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి . ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు చివరకు సచివాలయం కూల్చివేత కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెల్లడించింది. మొత్తానికి సీఎం కేసీఆర్ పాత సచివాలయాన్ని కూల్చివేసి అనుకున్నదే చేస్తున్నారు.

English summary
TRS chief Telangana CM Kalvakuntla Chandrashekhar Rao is in the process of construct the secretariat and assembly buildings . The demolition of the old buildings started today morning. The first C block is being demolished with JCBs. The security arrangements have been made by the police as the demolition process has begun in the early hours in the morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X