వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దానిని బ్లాక్ మనీ అనొద్దు, అలా అయితే మోడీకి మద్దతు: కేసీఆర్ కొత్త ప్రతిపాదన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సామాన్యుల వద్ద రూ.2.50 లక్షలకు పైగా డబ్బులు ఉంటే వాటిని బ్లాక్ మనీగా కాకుండా, లెక్కలోకి రాని నగదుగా పరిగణించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆయన గురువారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన పరిస్థితిని ప్రధానికి వివరించారు.

షాకింగ్: 'బ్లాక్ మనీని తెల్లగా మార్చుకునేందుకే మోడీ నోట్ల రద్దుపై కేసీఆర్ మౌనం' షాకింగ్: 'బ్లాక్ మనీని తెల్లగా మార్చుకునేందుకే మోడీ నోట్ల రద్దుపై కేసీఆర్ మౌనం'

అధికారులతో భేటీ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తాను తీసుకు వెళ్తానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు పెద్ద నోట్ల రద్దు దోహదపడితే ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని కేసీఆర్ ఈ సమీక్షలో కేసీఆర్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

Demonetisation: Telangana CM KCR to meet PM Modi

రూటు మార్చారు: నల్లధనం మార్చుకునేందుకు నాయకుల సరికొత్త ఎత్తురూటు మార్చారు: నల్లధనం మార్చుకునేందుకు నాయకుల సరికొత్త ఎత్తు

రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం ఎల్లుండి ప్రధాని మోడీని కలవనున్నారు. రేపు ఢిల్లీకి చేరుకుని అందుబాటులో ఉండాలని ప్రధాని మోడీ సూచించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలపై కేసీఆర్.. మోడీతో చర్చిస్తారు.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao to to meet PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X