వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి 'కామన్ మాన్' మద్దతు: 'మాకు అలవాటే, మీరు ఆందోళన చెందొద్దు'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు వరుస కడుతున్నారు. ప్రజలు క్యూలు కడుతూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విపక్షాలు దీనినే ప్రధానంగా లేవనెత్తుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారను, క్యూలు కడుతున్నారని, నోట్ల రద్దు సరికాదని, వెంటనే రద్దును ఎత్తి వేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ కామన్ మాన్ (సాధారణ పౌరుడు) వాట్సాప్‌లో ఓ ఆసక్తికర సందేశం పెట్టారు. అది ఇప్పుడు వాట్సాప్‌లో దూసుకుపోతోంది. దానిని చాలామంది తమ తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఇతరులకు పంపిస్తున్నారు.

comman man

మాకు క్యూ కట్టడం కొత్త కాదని, ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ విషయంలో రాద్దాంతం చేయడం విడ్డూరమని అందులో అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పుడు మార్పిడి కోసమే క్యూ కట్టడం లేదని, గత అరవై, డెబ్బై ఏళ్లుగా ఇది అలవాటయిందని అందులో పేర్కొన్నారు. మా క్యూల గురించి మీకు ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు.

ఆ వాట్సాప్ సందేశం ఇలా ఉంది..

'ప్రియమైన ప్రతిపక్ష నాయకులకు మా మనస్ఫూర్తి విజ్ఞప్తి. మా సాధారణ పౌరుల ఇబ్బందుల గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మాకు ఇది అలవాటే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మాకు క్యూలో నిలబడటం అలవాటయింది...

రేషన్
కిరోసిన్
ఆసుపత్రి
స్కూల్ అడ్మిషన్
కాలేజ్ అడ్మిషన్
పుస్తకాలు
మెడిసిన్స్
ట్రెయిన్ టిక్కెట్స్
బస్ పాస్, టిక్కెట్లు
ఎల్పీజీ కనెకన్షన్
విద్యుత్ బిల్లు చెల్లించేందుకు
నీటి బిల్లు చెల్లించేందుకు
మున్సిపల్ ట్యాక్స్ చెల్లించేందుకు
సేల్స్ ట్యాక్స్ చెల్లించేందుకు
ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేందుకు
బర్త్ సర్టిఫికేట్ కోసం
డెత్ సర్టిఫికేట్ కోసం
అలాగే.. మీకు ఓటు వేసేందుకు' అని ఆ వాట్సాప్‌లో సందేశం ఉంది.

ఇలా మీరు లేదా మీ కుటుంబ సభ్యులు గత డెబ్బై ఏళ్లుగా చేయలేదు. మాకు అలవాటయింది. కాబట్టి ఇప్పుడు బ్యాంకుల వద్ద క్యూకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా గురించి మీకు ఆందోళన అవసరం లేదని, మీ గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. చివరలో కామన్ మ్యాన్ అని రాశారు.

English summary
The opposition is at logger heads with the government over the demonetisation issue. The Parliament has witnessed ugly scenes causing disruption and adjournments over this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X