రూ.2 లక్షలు.. ఐటీ రిటర్న్‌లో కొత్త నిబంధన: ఆధార్-పాన్ లింక్‌కు 2 పరిష్కారాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై/హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్ను పత్రంలో కొత్త నిబంధనలకు చోటు కల్పించారు. 2017-18 మదింపు సంవత్సరం (అంటే 2016-17 ఆర్థిక సంవత్సరం)లో దాఖలు చేయాల్సిన ఐటీ రిటర్ను పత్రంలో రుణాల చెల్లింపు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా కాలం ఉంది.

పెద్ద నోట్లు రద్దయిన అనంతరం 50 రోజుల కాల వ్యవధిలో రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వివరాలను ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ల్లో తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో చెల్లించి ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది.

వార్షిక ఆదాయానికి, నోట్ల రద్దు కాలంలో జమ చేసిన సొమ్మునకు పొంతన ఉన్నదీ లేనిదీ పరిశీలించడానికే ఈ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ నిబంధన ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం.

పాన్‌- ఆధార్‌ అనుసంధానికి కొత్త విధానం

పాన్‌- ఆధార్‌ అనుసంధానికి కొత్త విధానం

రిటర్నుల్లో ఆధార్‌ సంఖ్యను పేర్కొనడాన్ని తప్పనిసరి చేశారు. పేర్లు సరిగ్గా నమోదు కాకపోవడంవల్ల ఆధార్‌, పాన్‌ల అనుంధానంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం రెండు పరిష్కార మార్గాలను కనుగొంది.

ఆధార్ వెబ్ సైట్లోకి వెళ్లి పేరు మార్పిడి చేసుకోవచ్చు

ఆధార్ వెబ్ సైట్లోకి వెళ్లి పేరు మార్పిడి చేసుకోవచ్చు

ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు మార్పిడి చేసుకోవచ్చు. ఇందుకు ఆధారంగా పాన్‌ కార్డును స్కాన్‌ చేసి జతచేస్తే సరిపోతుంది. ఆధార్‌లో పేర్కొన్న సెల్‌ నెంబరునే ప్రస్తుతం కూడా ఉపయోగిస్తుంటే ఇది సాధ్యపడుతుంది. ఇది సులువైన మార్గమని ప్రభుత్వం పేర్కొంది.

పుట్టిన తేదీలు ఒకేలా ఉంటేనే..

పుట్టిన తేదీలు ఒకేలా ఉంటేనే..

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా కూడా అనుసంధానం చేసే సౌకర్యం ఉంది. ఒన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ద్వారా అనుసంధానం చేయవచ్చు. రెండు పత్రాల్లోనూ పుట్టిన తేదీ ఒక్క మాదిరిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

పెళ్లైన తర్వాత ఇంటి పేరు మారిన వారు..

పెళ్లైన తర్వాత ఇంటి పేరు మారిన వారు..

ఒక పత్రంలో ఇంటి పేరుతో, మరో దానిలో పొడి అక్షరాలతో పేర్లు రాసిన వారు, పెళ్లయిన తర్వాత ఇంటి పేర్లు మారిన వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌ నమోదుకు సొమ్ము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taxpayers also need to provide the details of all the savings and current accounts held by them at any time during the previous year.
Please Wait while comments are loading...