వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్‌ఫ్లూ బారిన డిప్యూటీ సీఎం దంపతులు.. నాలుగు రోజులుగా నిమ్స్‌లో

తెలంగాణలో ఇప్పటికే 100మందికి స్వైన్ ఫ్లూ సోకగా.. వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు స్వైన్ ఫ్లూ పేషెంట్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దంపతులు స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. గత నాలుగు రోజులుగా డిప్యూటీ సీఎం దంపతులు నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో వారు బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం దంపతులు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని నిమ్స్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. వారి రక్త నమూనాలను సేకరించి ఐపీఎంకు పంపించినట్టు వైద్యులు తెలిపారు.

Deputy Chief Minister contracts swine flu

కాగా, తెలంగాణలో ఇప్పటికే 100మందికి స్వైన్ ఫ్లూ సోకగా.. వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు స్వైన్ ఫ్లూ పేషెంట్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు కర్నూలు, నెల్లూరు, తిరుపతిలోను స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఏపీని కూడా కలవరపెడుతోంది.

English summary
Deputy Chief Minister Mohammed Mahmood Ali has been infected with swine flu, the virus that has killed about half a dozen people in the State this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X