వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌కు కరోనా పాజిటివ్, మరో నలుగురికి కూడా, క్వారంటైన్‌‌లో ఫ్యామిలీ..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వైరస్ వణికించగా.. హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి కూడా వైరస్ వచ్చింది. అదే రోజే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు వైరస్ నిర్దారణ అయ్యింది. ప్రజాప్రతినిధులకు వైరస్ ఎలా వచ్చిందనే అంశంపై స్పష్టత లేదు. ఐదుగురు నేతలు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

డిప్యూటీ స్పీకర్‌కు పాజిటివ్

డిప్యూటీ స్పీకర్‌కు పాజిటివ్

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఆయన మూడురోజుల నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. పద్మారావుగౌడ్‌తోపాటు నలుగురు కుటుంబసభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. వారు సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఐదుగురికి పాజిటివ్

ఐదుగురికి పాజిటివ్

కరోనా వైరస్‌కు చిన్న, పెద్ద తేడా లేదు. ముట్టుకుంటే అంటుకుంటోంది వైరస్. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ సహా ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వైరస్ సోకింది. తొలుత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా వైరస్ సోకింది. వెంటనే అతను యశోదా ఆస్పత్రిలో చేరిపోయారు. తర్వాత నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు వైరస్ బారినపడ్డారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి వైరస్ వచ్చింది. తర్వాత బిగాల గణేశ్ గుప్తాకు కూడా కరోనా వైరస్ వచ్చింది.

దూరం.. దూరం...

దూరం.. దూరం...


ఎమ్మెల్యేలు, మంత్రి, డిప్యూటీ స్పీకర్‌కు కూడా కరోనా వైరస్ రావడంతో మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగినే వైరస్ వస్తుందని.. గ్రహించి ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఐదుగురు కూడా వివిధ సందర్భాల్లో జనంతో మమేకమవడంతో వైరస్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మిగతా నేతలు అల్టరయ్యారు.

రికార్డుస్థాయిలో..

రికార్డుస్థాయిలో..

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 973 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో కరోనా వైరస్ సోకిన మొత్తం సంఖ్య 15 వేల దాటింది. 15 వేల 394గా ఉంది. వైరస్ సోకి సోమవారం ఆరుగురు చనిపోగా..వైరస్ సోకి చనిపోయిన మొత్తం సంఖ్య 253గా ఉంది. వైరస్ సోకి సోమవారం 410 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న సంఖ్య 5 వేల 582 మందిగా ఉంది. ప్రస్తుతం 9 వేల 559 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Recommended Video

CPM Demands KCR To Increase The Tests & Save People Against COVID-19
లాక్‌డౌన్..?

లాక్‌డౌన్..?

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున్న గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. గురువారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ లాక్ డౌన్, విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. మొదటిలాగానే పాలు, కురగాయాలు, మెడికల్ షాపులు, బియ్యం షాపులు.... అత్యవసర సేవలు మాత్రమే అనుమతిస్తున్నారు. వైరస్ పెరుగుతున్నందన.. రాత్రితోపాటు ఉదయం కూడా కర్ప్యూ కొనసాగిస్తారని తెలుస్తోంది. ఉదయం 2 గంటలు మాత్రం సరుకులు కొనుగోలు చేసేందుకు అలో చేసే ఛాన్స్ ఉంది.

English summary
telangana state deputy speaker padma rao goud infected coronavirus. his four family members also tested corona positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X