వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు... తేల్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్...

|
Google Oneindia TeluguNews

గత కొద్దిరోజులుగా తెలంగాణలో నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు కేటీఆర్ సీఎం కావాలని... కాబోతున్నారని.. వరుసబెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఏకంగా కాబోయే సీఎం అంటూ కేటీఆర్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

Recommended Video

Telangana Deputy CM katti Padma rao sensational Comments on Telangana next cm
త్వరలోనే సీఎంగా కేటీఆర్ : పద్మారావు

త్వరలోనే సీఎంగా కేటీఆర్ : పద్మారావు

సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో పద్మారావు,మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ... కార్మికుల తరుపున,తెలంగాణ శాసనసభ తరుపున కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు కేటీఆర్ సీఎం కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చగా.. మరికొందరు కేటీఆర్ సీఎం అవడం ఖాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పద్మారావు గౌడ్ ఏకంగా శుభాకాంక్షలు కూడా చెప్పడం విశేషం.

మంత్రులు,ఎమ్మెల్యేల వరుస ప్రకటనలు...

మంత్రులు,ఎమ్మెల్యేల వరుస ప్రకటనలు...

బుధవారం(జనవరి 20) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సీఎం పదవికి కేటీఆర్ అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని ప్రశ్నించిన ఆయన... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరో మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి, ష‌కీల్ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు.

అందుకే కేసీఆర్ హోమం చేశారా?

అందుకే కేసీఆర్ హోమం చేశారా?

కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో హోమం కూడా నిర్వహించినట్లు ప్రముఖ పత్రిక వెలుగు దినపత్రిక ప్రచురించింది. భోగి,సంక్రాంతి నాడు మకరం సంక్రమించే సమయంలో ఈ హోమం జరిపి ఉండొచ్చునని పేర్కొంది. ఆ హోమం తర్వాతే కేసీఆర్ దంపతులు కాళేశ్వరం వెళ్లి వాటి అవశేషాలను గోదావరిలో కలిపారని పేర్కొంది.

ఏదైనా మంచి కార్యం మొదలుపెట్టే ముందు హోమాలు జరిపించే కేసీఆర్ ఇప్పుడు తనయుడి కోసం ఈ హోమం చేయించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అసలు దేవుడినే నమ్మని కేటీఆర్ కోసం కేసీఆర్ ఎందుకు పూజలు చేయిస్తారన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మరో ఒకటి,రెండు నెలల్లో కేటీఆర్ సీఎం కావడం ఖాయమన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది.

English summary
Padma Rao and Minister KTR participated in the inaugural function of the newly constructed South Central Railway Employees Union Divisional Office in Secunderabad. Speaking on the occasion, Padmarao said that he wished KTR on behalf of the workers and the Telangana Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X