వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో ధరలు దేశవ్యాప్తంగా తగ్గినప్పటికీ తెలంగాణలో మాత్రం భగ్గుమంటున్నాయి

|
Google Oneindia TeluguNews

Recommended Video

పెట్రో ధరలు దేశవ్యాప్తంగా తగ్గినప్పటికీ తెలంగాణలో మాత్రం భగ్గుమంటున్నాయి

హైదరాబాద్: ఇంధనం ధరల్లో రూ.2.50 తగ్గిస్తూ కేంద్రం నిన్న సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసినా... తెలంగాణలో మాత్రం పెట్రోల్ ధరలు మండిపోతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరలు రూ.88.97 నుంచి 86.07కు పడిపోయాయి. అయినప్పట్టికీ ఈ ధర తగ్గుదలలో పెద్ద తేడా కనిపించలేదని చెబుతున్నారు నగర వాసులు. ఇక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించడంతో తెలంగాణ రాష్ట్రంలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధర అధికంగా ఉంది. ఇక డీజిల్ ధర రూ.81.99 నుంచి 79.03కు పడిపోయింది.

సామాన్యుడికి ఊరట: పెట్రోల్ ధరలను తగ్గించిన కేంద్రం..ఎంతో తెలుసా..?సామాన్యుడికి ఊరట: పెట్రోల్ ధరలను తగ్గించిన కేంద్రం..ఎంతో తెలుసా..?

గడిచిన 9నెలల్లో పెట్రోల్‌పై 16శాతం, డీజిల్ పై 22 శాతం ధరలు పెరిగాయి. ఎక్సైజ్ డ్యూటీ రూ.1.50 తగ్గగా ఆయిల్ కంపెనీలు ఒక రూపాయి తగ్గించడంతో మొత్తం మీద రూ.2.50 తగ్గిందని తెలంగాణ రాష్ట్ర డీలర్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వినయ్ కుమార్ తెలిపారు. ఇక మరో తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు తెలంగాణతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు వ్యాట్‌ను తగ్గించింది. గతేడాది జూలై తర్వాత మళ్లీ ఇప్పుడే కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని డాటా అనలిస్ట్ రాకేష్ రెడ్డి తెలిపారు.

Despite fuel prices drop across the country, Telangana seems to be still costlier

"2010 వరకు ఇంధన ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉండేలా చూసేదని అదే సమయంలో ఆయిల్ కంపెనీలు నష్టాలు చవిచూసే అవకాశం ఉందని భావిస్తే వాటికి కేంద్రమే ఆ నష్టాన్ని పూడ్చేది. 2010లో యూపీఏ ప్రభుత్వం ముడిచమురు ధర ఆధారంగా ఇంధనం ధరలను కంట్రోల్ చేసేది "అని రాకేష్ రెడ్డి తెలిపారు. ఇక చివరిసారిగా అక్టోబర్ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక డీజిల్ ధరను కేంద్రం నియంత్రించింది.

English summary
The petrol price in the city dropped from Rs 88.97 to Rs 86.07, a reduction of Rs 2.90, after the Centre reduced excise duty on fuel by Rs 1.50 and directed oil manufacturing companies to absorb Rs 1. With a slew of other state governments cutting local tax, fuel in TS will now be among the costliest in the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X