వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్వీట్‌కు కెటిఆర్ రెస్పాన్స్: టీ విక్రయిస్తున్న 15 ఏళ్ళ బాలుడికి స్కూల్లో సీటు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీ విక్రయించే 15 ఏళ్ళ సమీయుద్దీన్ ఫైజాన్ తిరిగి స్కూల్‌లో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చొరవ చూపారు. ట్విట్టర్‌లో వచ్చిన వినతి మేరకు మంత్రి కెటిఆర్ స్పందించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో సమీ చేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి కెటిఆర్ చొరవ చూపుతారు. ఈ తరహ ఘటనలు అనేకం చోటుచేసుకొన్నాయి. ఇదే తరహ ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకొంది.

స్కూల్ ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సమీ స్కూల్ మానేశాడు. అంతేకాదు టీ విక్రయిస్తూ తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళాడు.

టీ విక్రయిస్తున్న సమీయుద్దీన్‌ను స్కూల్లో చేర్పించిన కెటిఆర్

టీ విక్రయిస్తున్న సమీయుద్దీన్‌ను స్కూల్లో చేర్పించిన కెటిఆర్

హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో సిటీ సెంటర్ మాల్ వద్ద సమీయుద్దీన్ అనే 15 ఏళ్ళ బాలుడు స్కూల్ మానేసి టీ విక్రయిస్తున్నాడు.సమీయుద్దీన్ చదివే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు చెల్లించే స్థోమత లేకపోవడంతో స్కూల్‌ను మాన్పించాడు. ఈ విషయాన్ని రియాజుద్దీన్ అనే స్థానికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళాడు.దీంతో మంత్రి కెటిఆర్ స్పందించారు.ఆ బాలుడిని స్కూల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

ట్వీట్‌కు స్పందించిన మంత్రి కెటిఆర్

ట్వీట్‌కు స్పందించిన మంత్రి కెటిఆర్

రియాజుద్దీన్ అనే స్థానికుడు మంత్రి కెటిఆర్‌కు సమీయుద్దీన్ పరిస్థితిని వివరించారు. టీ స్టాల్ వద్ద సమీయుద్దీన్ ఫోటోను తీసి ట్వీట్‌కు జత చేశారు. బంజారాహిల్స్‌‌లోని సింగిడి బస్తీకి చెందిన సమీయుద్దీన్ స్కూల్ మానేసిన విషయాన్ని కెటిఆర్ దృష్టికి రియాజుద్దీన్ తీసుకెళ్ళాడు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో సమీకి సీటు ఇప్పించాలని కోరారు. ఈ ట్వీట్‌కు కెటిఆర్ సానుకూలంగా స్పందించారు.

సమీని స్కూల్లో చేర్పించాలని కెటిఆర్ ఆదేశం

సమీని స్కూల్లో చేర్పించాలని కెటిఆర్ ఆదేశం

రియాజుద్దీన్ ట్వీట్‌కు మంత్రి కెటిఆర్ స్పందించడమే కాదు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సమీని గుర్తించి వెంటనే అతడిని స్కూల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.

సమీ తండ్రికి ఫోన్ చేసిన అధికారులు

సమీ తండ్రికి ఫోన్ చేసిన అధికారులు

కెటిఆర్ ఆదేశం మేరకు సమీ తండ్రి అజీజ్‌కు అధికారులు ఫోన్ చేశారు. సమీ వివరాలను తీసుకొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ల్లో సమీని చేర్పించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించారు. త్వరలోనే సమీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చోటు దక్కనుంది.

English summary
A cruel twist of fate may have forced this 15-year-old boy to trade in his schoolbag for a kettle of tea but thanks to Telangana IT and municipal administration minister K Taraka Rama Rao, tea-seller Md Sami Uddin Faizan will finally be back in school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X