India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక అలేఖ్యకు సంబంధించి కొద్ది గంటలుగా కొనసాగుతోన్న రచ్చకు తెలంగాణ టూరిజం శాఖ చెక్ పెట్టింది. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు ప్రభుత్వం భారీ షాకిచ్చిందని, మంగళవారం నాటికే ఆమెను ఆ హోదా నుంచి తొలగించారని మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. అయితే, అసలు నిజం మాత్రం ఇదంటూ తెలంగాన టూరిజం శాఖే వివరణ ఇచ్చుకుంది..

ఒక్కరోజు ముఖ్యమంత్రికి బీజేపీ గాలం -నటుడు అర్జున్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ -అంత లేదంటూ..ఒక్కరోజు ముఖ్యమంత్రికి బీజేపీ గాలం -నటుడు అర్జున్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ -అంత లేదంటూ..

ఆ వార్తలన్నీ వట్టిదే..

ఆ వార్తలన్నీ వట్టిదే..

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌(ప్రచార కర్త)గా హారిక నియామకం ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలియకుండా జరిగిందని, దీనిపై మంత్రితోపాటు ఉన్నతాధికారులూ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ వెంటనే హారిక నియామకానికి సంబంధించిన వివరాలను టీఎస్‌టీడీసీ వెబ్‌సైట్ నుంచి తొలగించారని దాదాపు అన్ని ప్రముఖ చానెళ్లు, వెబ్ సైట్లలో (వన్ ఇండియా కాదు) వార్తలు వచ్చాయి. కాగా, సదరు వార్తలో నిజం లేదని, హారిక తొలగింపుపై వస్తున్నవన్నీ పుకార్లేనని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు.

హారికను తొలగించలేదు..

హారికను తొలగించలేదు..

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బిగ్‌బాస్ ఫేమ్‌, దేత్త‌డి హారిక‌నే ఉంటార‌ని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ది సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త స్ప‌ష్టం చేశారు. హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌ కార్యాల‌యంలో టీఎస్‌టీడీసీ ఎండీ మ‌నోహ‌ర్ రావుతో క‌లిసి ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్త‌డి హారిక గారిని తొల‌గించార‌ని ప‌లు మీడియా చాన‌ళ్లలో వ‌స్తున్న వార్త‌లను ఆయ‌న ఖండించారు. దేత్త‌డి హారిక గారిని తొల‌గించార‌న్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. ఈ క్రమంలో చైర్మన్ గుప్తా కీలక కామెంట్లు చేశారు

తెలంగాణ బిడ్డ.. తక్కువ డబ్బులకే..

తెలంగాణ బిడ్డ.. తక్కువ డబ్బులకే..

''దేత్తడి హారిక తెలంగాణ ఆడబిడ్డ. కరీంనగర్ వాస్తవ్యురాలు. బిగ్ బాస్ ఫేమ్ గా, యూట్యూబర్ గా ఆమెకు సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నియామకానికి సంబంధించిన వీడియోనే 15లక్షల మంది చూశారు. తెలంగాణ బిడ్డగా ఆమె పాపులారిటీతో టూరిజానికి క్రేజ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో అంబాసిడర్ గా నియమించాం. తాను పాల్గొనే కార్యక్రమాల వరకే కొంత మొత్తంలో మాత్రమే డబ్బులు ఇచ్చేలా, అది కూడా ప్రభుత్వం నుంచి కాకుండా టీఎస్‌టీడీసీనే చెల్లించేలా ఏర్పాట్లు చేశాం. నిజానికి కరోనా వల్ల టూరిజం దారుణంగా దెబ్బతినింది. ఏడాదిగా..

'అంబానీ బాంబు' కేసులో అనూహ్య మలుపు -పీపీఈ కిట్‌‌ను ఇలా కూడా వాడొచ్చా? -సీసీటీవీలో అనుమానితుడి గుర్తింపు'అంబానీ బాంబు' కేసులో అనూహ్య మలుపు -పీపీఈ కిట్‌‌ను ఇలా కూడా వాడొచ్చా? -సీసీటీవీలో అనుమానితుడి గుర్తింపు

మహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం..

మహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం..

కరోనా వల్ల ఏడాదిగా టూరిజం హోటళ్లు, ఆయా టూరిస్టు కేంద్రాల్లోని సిబ్బంది, టూరిజం బస్సుల డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. సంస్థ ఉద్యోగులకు కూడా సగం జీతాలే ఇచ్చుకున్నాం. అయితే, ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్నాం. టూరిస్టుల రాక క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టూరిజం ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేం. సినిమా స్టార్లు, పెద్ద సెలబ్రిటీలు అయితే డబ్బులు ఎక్కువ పెట్టాలి. ఈ పరిస్థితుల్లో మహేశ్ బాబును తెలంగాణ టూరిజం అంబాసిడర్ గా పెట్టుకుని కోట్ల రూపాయలు ఇచ్చుకోలేం. అందుకే అందుబాటులో ఉన్న వనరులతో, తెలంగాణ బ్రాండ్ ఉంటుందనే హారికను అంబాసిడర్ గా నియమించాం. ఇది నా ఒక్కడి నిర్ణయం కానేకాదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ అధికారులు అందరం సమిష్టిగా తీసుకున్నదే. ఇంకా..

ఊటీని తలదన్నే మన అలీ సాగర్

ఊటీని తలదన్నే మన అలీ సాగర్

తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్ గారు, మంత్రులు కేటీఆర్ గారు, శ్రీ‌నివాస్ గౌడ్ గార్ల నాయ‌క‌త్వంలో ముందుకు వెళుతున్నాం. అందుకోస‌మే టూరిజాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో దేత్త‌డి హారికను అంబాసిడర్ గా నియ‌మించాం. తెలంగాణ టూరిజాన్ని నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు కృషి చేస్తున్నాం. కేరళ, ఊటీ స్థాయిలో మన దగ్గరే ఉన్న అలీ సాగర్ హిల్ స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ సిటీలోని టూరిజం కేంద్రాలను బాగా మెరుగుపర్చాం. రాష్ట్రంలోని అన్ని టూరిస్టు కేంద్రాలనూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం'' అని టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా వివరించారు. కాగా,

బ్రాండ్ అంబాసిడర్‌పై వివాదం..

బ్రాండ్ అంబాసిడర్‌పై వివాదం..

బహుశా కొంద‌రు గిట్ట‌ని వాళ్లు దేత్త‌డి హారిక‌ను తొల‌గించిన‌ట్లు దుష్ప్ర‌చారం చేయడం, మీడియా కూడా దాన్ని గుడ్డిగా నమ్మి వార్తలు వేయడం వల్ల గందరగోళం తలెత్తిందని, తెలంగాణ టూరిజం శాఖ పేర్కొంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గంగవ్వనో, కనకవ్వనో, మలావత్ పూర్ణనో కాకుండా హారికను నియమించడం తెలివి తక్కువ చర్య అని కొందరు విమర్శిస్తే.. తెలంగాణలోనే ఉంటూ ఇక్కడి టూరిజం అభివృద్దికి టాలీవుడ్ స్టార్లు తక్కువ పారితోషికం తీసుకుని ప్రకటనలు చేస్తే తప్పేముంది? అని ఇంకొదరు ప్రశ్నించారు. గతంలో కొందరు స్టార్లు తమ సొంత ప్రాంతాల అభివృద్ధి కోసం అంబాసిడర్లుగా వ్యవహరించిన ఘటనలను వారు గుర్తుచేస్తున్నారు.

English summary
Telangana State Tourism Development Corporation (TSTDC) Chairman Uppala Srinivas Gupta clarified that Bigg Boss Fame Dettandi Harika will be the brand ambassadors of the Telangana Tourism. speaking to media on tuesday, gupta said There is no truth in the news that Dettandi Harika has been removed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X