వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడి

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాన మంత్రి మరియు జెడి (ఎస్) అధినేత హెచ్.డి. దేవెగౌడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ భాగస్వామిగా ఉన్నామని , లోక్ సభ ఎన్నికలను తన మిత్రపక్షంతో కలిసి పోరాడినట్లు దేవె గౌడ తెలిపారు . బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారంనుండి దించటానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా ఆయన స్వాగతిస్తామని తెలిపారు. దేవెగౌడ తన 85 వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో జగన్ మద్దతు వారికే ... వ్యూహాత్మకంగా అడుగేస్తున్న జగన్ కేంద్రంలో జగన్ మద్దతు వారికే ... వ్యూహాత్మకంగా అడుగేస్తున్న జగన్

మే 23న కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ సమావేశానికి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని దేవెగౌడ తెలిపారు. ఒకవేళ అలాంటి సమావేశం ఉంటె అధికారిక ఆహ్వానం లేకపోయినా సమావేశంలో హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. అన్ని పక్షాలను, ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం సోనియా గాంధీ యొక్క "రాజకీయ పరిపక్వత" కు సాక్ష్యం అని ఆయన అభిప్రాయపడ్డారు . కేంద్రంలో ఎన్డీయే విఫలం అయితే ఎవరు ప్రధాని కావాలి అన్న అంశంపై మాట్లాడిన ఆయన ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వకుండా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఇక బీజేపీయేతర కూటమిలోనూ చాలా ప్రాంతీయ పార్టీలున్నాయి. వాటిన్నటి మధ్య ముందు ఏకాభిప్రాయం రావాలి. మే 23 న సమావేశం జరిగితే సోనియా గాంధీకి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను అని దేవెగౌడ పేర్కొన్నారు.

Deve Gouda shock to KCR fedaral front .. He said it is clear that the journey is with Congress

ప్రధాని నరేంద్రమోడీని ఓడించాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్న తరుణంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది . మరి కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయి. ఇక ఈ నేపధ్యంలో బీజేపీ ని గద్దె దించటానికి అన్ని పార్టీలు ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. సోనియా సమావేశం అందుకు వేదిక అవుతుంది అని దేవెగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు . మొత్తానికి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో స్టాలిన్ వెళ్లి అడిగితే షాకిస్తే, దేవెగౌడ మద్దతు అడగకముందే తమ మద్దతు ఎవరికో చెప్పి షాక్ ఇచ్చారు.

English summary
Former Prime Minister and JD(S) supremo H.D. Deve Gowda has said that being the coalition partner of the Congress in the State and having fought the Lok Sabha elections as its ally, his party would acknowledge any decision taken by the Congress to keep the BJP-led NDA alliance away from the seat of power after May 23.On the news that Congress leader Sonia Gandhi had called a meeting on May 23 of non-NDA party leaders, he said he had not got any official invite yet but would attend if such a meeting is convened. Such a move, he said, is testimony to Ms. Gandhi’s “political maturity”.On who should occupy the chair of Prime Minister in the event of the NDA failing to get enough numbers, Mr. Gowda said, “It is not possible for regional parties to form a government at the Centre without the support of the Congress. There are many aspirants, and a consensus has to be reached among them. I will communicate my opinion to Ms. Gandhi during the May 23 meeting.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X