• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదు.!మహానాడులో తెలంగాణ తీర్మాణాలను ఆమోదించిన చంద్రబాబు.!

|

హైదరాబాద్ : ఏ రాష్ట్రంలోనైనా సంపద సృష్టి చాలా ముఖ్యమని, సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదని, హైదరాబాద్ రాజధానిగా సంపద సృష్టించగలిగినందుకే అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ది సాధించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుపారు.మహానాడు సందర్బంగా తెలంగాణ తీర్మాణాల పట్ల బాబు ప్రసంగించారు. ఆరోజు టీడిపి వేసిన అభివృద్ది పునాదులు ఎవరు తొలగించలేదు కాబట్టి తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోయిందని అన్నారు. సంక్షేమం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించాలని, తెలుగుదేశం బలహీనవర్గాల అభ్యున్నతికోసం పనిచేసే పార్టీ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

 తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంది.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహానాడులో తీర్మానం

తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంది.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహానాడులో తీర్మానం

మహానాడులో తెలంగాణ ప్రభుత్వ పని తీరు, సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం తదితర అంశాలై తీర్మాణాలను మహానాడులో ప్రవేశపెట్టారు. తెలంగాణ ముఖ్యమంతి చంద్రశేఖర్ రావు పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంపై మహానాడు వేదికగా నెల్లూరు దుర్గా ప్రసాద్ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులు బంగారు పంటలు పండిస్తారని, రైతుల కష్టాలు తీరి పోతాయని, తెలంగాణను విత్తన బాండాగారం చేస్తానని ఉద్యమకాలంలో మాయమాటలు చెప్పిన చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచారని, చంద్రశేఖర్ రావు పాలనలో రైతులు ఎంతో వేదనకు గురవుతున్నారని, చంద్రశేఖర్ రావు ఏడేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేసిందేమీ లేదని ఆరోపించారు.

 రైతు సమస్యలపై టీడిపి అనేక ఉద్యమాలు చేసింది.. మహానాడులో స్పష్టం చేసిన తెలంగాణ టీడిపి నేతలు..

రైతు సమస్యలపై టీడిపి అనేక ఉద్యమాలు చేసింది.. మహానాడులో స్పష్టం చేసిన తెలంగాణ టీడిపి నేతలు..

రైతులు పడుతున్న అనేక కష్టాలపై తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో టీడిపి తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసిందని స్పష్టం చేసారు. కోటి ఎకరాల్లో ప్రొక్యూర్ మెంట్ వచ్చిందని చంద్రశేఖర్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నాని, ప్రాంతీయ తత్వం కలిగిన చంద్రశేఖర్ రావు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ విభజిస్తున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ని ప్రాంతాలను సమానంగా చూశారని, రైతుల మీద కోపంతో పంట కొననని చెప్పిన చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చారని దుర్గాప్రసాద్ గుర్తు చేసారు. రైతులకు నేడు గిట్టుబాట ధర కరువైందని, వారు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఘాటుగా విమర్శించారు దుర్గాప్రసాద్.

 కొన్ని వర్గాలకే రైతుబంధు పథకం.. కాళేశ్వరం పేరుతో దోపిడీ జరిగిందన్న టీటీడిపి నాయకులు..

కొన్ని వర్గాలకే రైతుబంధు పథకం.. కాళేశ్వరం పేరుతో దోపిడీ జరిగిందన్న టీటీడిపి నాయకులు..

అంతే కాకుండా తెలంగాణలో వ్యాపారులు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు పథకం భూస్వాములు, పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉందని, వ్యవసాయం చేయని వారే రైతు బంధు వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నారని మరో నేత జ్యోజి రెడ్డి అన్నారు. రైతుల సొమ్మును టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని, ఆరుగాలం కష్టించే రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో టీఆర్ఎస్, చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటున్నారని, తెలంగాణలో చెరువులు తెగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

 రైతు కష్టానికి ఫలితం రావాలి.. రైతు సమస్యల పరిష్కారినికి జాతీయ స్దాయిలో పోరాటం చేస్తామన్న చంద్రబాబు..

రైతు కష్టానికి ఫలితం రావాలి.. రైతు సమస్యల పరిష్కారినికి జాతీయ స్దాయిలో పోరాటం చేస్తామన్న చంద్రబాబు..

ఉద్యమ సమయంలో మాయమాటలతో రైతులను నమ్మించిన చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేశారని, చంద్రశేఖర్ రావు తీరుకు నిరసనగా తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ను ముట్టడించామని, రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న చంద్రశేఖర్ రావు కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడిపి నేతలు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటుందని, రైతులు ఎంత కష్ట పడుతున్నా వారికి సరైన ఫలితం దక్కడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా రైతులు ఇబ్బంది వస్తే వారికి మద్దత్తుగా న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చంద్రబాబు మహానాడు వేదికగా తెలంగాణ రైతాంగానికి భరోసా ఇచ్చారు.

English summary
Telugu Desam Party National President Nara Chandrababu Naidu said that Hyderabad has made significant progress in all fields as it has been able to create wealth as its capital. On the occasion of Mahanadu, Babu addressed the Telangana resolutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X