వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: దేవేందర్ గౌడ్ కుమారుడు క్షేమం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌తో పాటు మొత్తం 16 మంది సభ్యుల బృందం గురువారం సురక్షితంగా ఢిల్లీ చేరుకుంది. నేపాల్‌లో భూకంప బాధితులను ఆదుకునేందుకుగాను ఈ బృందం ఐదు రోజుల కిందట ఆ దేశానికి వెళ్లింది.

సింధుపాల్‌చౌక్‌ జిల్లాలోని షౌలే బజార్‌ గ్రామం కేంద్రంగా స్థానికులకు ఆహారం అందజేస్తోంది. 600-800 మందికి ఉదయం, రాత్రి భోజనాలు వండి పెట్టేవాళ్లమని వీరేందర్‌ తెలిపారు.
25 రోజులకు సరిపడా సరుకులు తీసుకువెళ్లామని, అయితే రెండోసారి తమ క్యాంపునకు అతి సమీపంలో భూకంపం రావడంతో మరిన్ని రోజులు అక్కడ ఉండటం క్షేమం కాదని స్థానికులు, తమ వాలంటీర్ల కుటుంబ సభ్యులు చెప్పటంతో తిరిగి వచ్చేశామని ఆయన అన్నారు.

Devender Goud's son Veerender safely returns

బాధితులకు సహాయం పంపించటం కంటే కూడా స్వయంగా వారికి వండి పెట్టడం చాలా సంతృప్తినిచ్చిందని చెప్పారు. వీరేందర్ గౌడ్ బృందం నేపాల్ వెళ్లిన తర్వాత మరోసారి భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో దేవేందర్ గౌడ్ తన కుమారుడిని క్షేమంగా తీసుకురావడానికి సహాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.

దేవేందర్ గౌడ్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను, పౌర విమానయానాల మంత్రి అశోక్ గజపతిరాజును కలిశారు. వీరేందర్ గౌడ్ బృందం క్షేమంగా తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Telangana Telugudesam party leader T Devender Goud's son Veerender Goud and his friends safely returned to India from earthquake hit Nepal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X