• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢీంచ‌క‌.!.ఢీంచ‌క‌..!ఢీంచ‌క‌..! ఓ ప‌క్క బ్యాండ్ తో ఉర్రూత‌లు..! మ‌రో ప‌క్క ఆక‌లితో అల‌మ‌టింపులు..!!

|

హైద‌రాబాద్ : నిశ్చితార్థం, పెళ్లి, వేడుక‌లు, పండుగలు మ‌రీ ముఖ్యంగా గ‌ణేష్ నిమ‌జ్జ‌నం..! ఇలా ఏ శుభకార్యమైనా ఆరుబ‌య‌ట బ్యాండ్‌ మోగాల్సిందే... పెళ్లైతే బారాత్ సాగాల్సిందే..! వివిధ రిథ‌మ్స్ లో బ్యాండ్ మోగుతుంటే బాడీలో ఒక‌ర‌క‌మైన డాన్స్ వైబ్రేష‌న్స్ మొద‌ల‌వుతుంటాయి. ఆ వైబ్రేష‌న్స్ కి ఎంత‌టి వారైనా కాస్త పూన‌కం తెచ్చుకోవాల్సిందే..! అందరూ ల‌య‌బ‌ద్దంగా డ్యాన్స్‌ చేయాల్సిందే.! న‌గ‌రంలో ఎక్క‌డైనా బ్యాండ్ మోగుతుందంటే చాలు చూపు అటువైపు ప‌డ‌క మాన‌దు..! బాడీలో లైట్ గా డాన్స్ మూవ్ మెంట్ రాక మాన‌దు. అదే సంగీతానికి, ల‌య‌బ‌ద్ద‌మైన శ‌బ్దానికి ఉన్న శ‌క్తి. అలాంటి బ్యాండ్ వాయిస్తూ హుషారు తెప్పించే బ్యాండ్ కార్మిక‌ల జీవితాలు మాత్రం స‌రైన ఆదాయం లేక వెల‌వెల‌బోతున్నాయి. బ్యాండ్ బాజా వాలాల జీవితాల‌పై వ‌న్ ఇండియా తెలుగు ప్ర‌త్యేక క‌థ‌నం..!

ఆ మోత‌కు ఎవ‌రైనా న‌డుం ఊపాల్సిందే..! న‌గ‌రంలో బ్యాండ్ బాజా అంటే యువ‌త‌లో మ‌హా క్రేజ్..!!

ఆ మోత‌కు ఎవ‌రైనా న‌డుం ఊపాల్సిందే..! న‌గ‌రంలో బ్యాండ్ బాజా అంటే యువ‌త‌లో మ‌హా క్రేజ్..!!

జంట న‌గ‌రాల్లో బ్యాండ్ బజాయించే నిపుణుల‌కు కొద‌వ లేదు. ఎక్క‌డ ఏ చిన్న శుభ‌కార్యానికైనా మొద‌ట బ్యాండ్ వాలాల‌ను ఆహ్వానించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. బ్యాండ్ బాజా తో అక్క‌డ ఏదో హ‌డావిడి జ‌రుగుతుంద‌ని చెప్ప‌క‌పోయినా ఇట్టే అర్థం ఐపోతుంది. బ్యాండ్ వాయిస్తున్న ప్ర‌దేశం ఒక‌ర‌క‌మైన ఉత్పాహ‌బ‌రితంగా ఉంటుంది. ఎవ్వ‌రు చూసినా బాడీలో ఒక‌ర‌క‌మైన రిథ‌మ్ ని నింపుకుని ఎప్పుడు ఆ బ్యాండ్ చ‌ప్పుడుకు అనుకూలంగా డాన్స్ చేయాలా అని ఎదురు చూస్తుంటారు. నాటుగేళ్ల నుండి అర‌వై ఏళ్ల వ్రుద్దుల వ‌ర‌కూ ఈ బ్యాండ్ శ‌బ్దానికి డాన్స్ చేయాల్సిందే. ఇక బ్యాండ్ వాళ్లు ఒక‌దానికి మించి మ‌రో రిథ‌మ్ కొడుతుండ‌డంతో ఉత్సాహం తారా స్థాయికి చేరుతుంది. ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల‌తో ర‌క‌ర‌కాలుగా డాన్స్ లు చేయ‌డం నేటి యువ‌త‌కు ట్రెండీ గా మారింది.

దయనీయస్థితిలో బ్యాండ్‌బాజా కార్మికులు..!బ్యాండ్ ఆడితే గాని డొక్కాడ‌ని ప‌రిస్థితి..!

దయనీయస్థితిలో బ్యాండ్‌బాజా కార్మికులు..!బ్యాండ్ ఆడితే గాని డొక్కాడ‌ని ప‌రిస్థితి..!

అయితే అందరి మనసులను ఉల్లాసపరిచే ఆ బ్యాండ్‌బాజా కార్మికుల జీవితాల్లో మాత్రం ఆనందం కరువ‌వుతోంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో డీజేల హవా కొనసాగుతుండగా, బ్యాండ్‌ కార్మికులకు డిమాండ్ తగ్గుతూ వ‌స్తోంది. దీంతో పని దొరకక బ్యాండ్ వాలాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెల‌కొంటున్నాయి. ఏడాది పొడుగూ పెద్ద‌గా ఏ కార్య‌క్ర‌మాలు ఉండ‌కపోయిన‌ప్ప‌టికి వినాయ‌క చవితి వ‌చ్చిందంటే బ్యాండ్ వాలాలు పండ‌గ చేసుకుంటారు. చ‌వితి పండ‌గ‌ మూడో రోజు నుండి నిమ‌జ్జ‌నాలు మొద‌ల‌వుతాయి కాబ‌ట్టి వారికి ప‌ని ప్రారంభం అవుతుంద‌ని, నాలుగు డ‌బ్బులు సంపాదించుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఆనంద‌ప‌డిపోతుంటారు.

అంద‌రిని ఉత్సాహ ప‌రిచే బ్యాండ్ కార్మికుల జీవితాల్లో మాత్రం నిరుత్సాహం..!!

అంద‌రిని ఉత్సాహ ప‌రిచే బ్యాండ్ కార్మికుల జీవితాల్లో మాత్రం నిరుత్సాహం..!!

పట్టణంలో దాదాపు 8000 మంది బ్యాండ్‌బాజా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక గ్రూప్‌లో 12 మంది కార్మికులు ఉంటారు. ఏ కార్యక్రమానికైనా బ్యాండ్‌ మోగించడానికి 12 మంది వెళ్తే 8 వేల నుంచి 10వేల వరకు ఆదాయం ఉంటుంది. అందులో బ్యాండ్‌ ఓనర్‌కు 3000 పోగా మిగిలిన డబ్బులు ఒక్కొక్కరూ పంచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రతి రోజు బ్యాండ్ వాయించే పని దొరకదు. ఆ రోజు వేరే కూలి పనికి వెళ్లే వెసులుబాటు చూసుకుంటారు ఈ కార్మికులు. లేకుంటే పస్తులుండాల్సిందే. కేవలం వీరికి పెండ్లిండ్ల సీజన్‌లో మాత్రమే కొంత పని దొరుకుతుంది. ఆ త‌ర్వాత వినాయ‌కుడు నిమ‌జ్జ‌నం సంద‌ర్బంగా కొంత పని దొరుకుతుంది.

పట్టించుకోని ప్రభుత్వం..! స‌ర్కార్ చేయూత అందించాలంటున్న కార్మికులు..!

పట్టించుకోని ప్రభుత్వం..! స‌ర్కార్ చేయూత అందించాలంటున్న కార్మికులు..!

సీజ‌న్ లో కాస్త మురుగైన సంపాద‌న ఉన్న‌ప్ప‌టికి అన్ సీజ‌న్ లో వచ్చే డబ్బులతో ఇంటి కిరాయి, పిల్లల చదువు ఫీజులు, కరెంట్‌ బిల్లులు, నిత్యావసర సరుకుల ఖ‌ర్చు భారంగానే ఉంటుంది. ప‌ని దొర‌క‌న‌ప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు బ్యాండ్ కార్మికులు. సకలజనుల సమ్మెలో, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పాల్గొని త‌మ వంతు మద్దతు తెలిపారు ఈ కార్మికులు. రాష్ట్రం ఏర్పడితే త‌మ‌ బతుకులు మారుతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం వారివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఉపాధి కల్పిస్తే మెరుగైన జీవ‌నం సాగిస్తామ‌ని, త‌మ పిల్ల‌ల‌కు ఉన్న‌త చ‌దువులు చెప్పిస్తామ‌ని వాపోతున్నారు బ్యాండ్ కార్మికులు. ప్ర‌భుత్వ పెద్ద‌లు అతి త‌క్కువ సంఖ్య‌లో ఉండే ఈ బ్యాండ్ కార్మికుల ప‌ట్ల సానుకూల ద్రుక్ప‌దంతో చేయూత అందించాల‌ని వ‌న్ ఇండియా త‌రుపున కోరుకుందాం..

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
band baja workers are facing many problems in twin cities. around about 8 thousand band workers are there in twin cities. they can get work in marriages seasons only. another seasons they goes for daily labour work. ganesh immersion can make money for them after marriage seasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more