హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదృష్టం పట్టింది: వలసల జిల్లా పాలమూరులో వజ్రాల గనులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరువు కాటాకాలకు, వలసలకు నిలయమైన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో వజ్రాల గనులున్నాయని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలోని కృష్ణ, భీమ నదుల మధ్య, కృష్ణ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో 20కి పైగా వజ్రాల గనులున్నాయని సర్వేలు తేల్చాయి.

ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియోఫిజిక్స్ విభాగం లెక్కల ప్రకారం గుల్బర్గా, రాయిచూర్ సరిహద్దుల్లో పలుచోట్ల వజ్రాల గనులు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలో మొత్తం 21 చోట్ల వజ్రాల గనులున్నట్లు తేల్చిన సర్వేలు తేల్చాయి.

 Diamond Mines in Palamuru at Mahabubnagar District

గతంలో జిల్లాలో వజ్రాల గనుల నిల్వలపై ఎన్నో అధ్యయనాలు జరిగినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం, మూడు డైమండ్ జోన్లు ఉండగా, ఉస్మానియా యూనివర్శిటీ జియోఫిజిక్స్ విభాగం వారు 21 జోన్లు ఉన్నట్లుగా గుర్తించారు.

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 1,999 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఏరోమాగ్నటిక్ అధ్యయనాల ద్వారా పరిశీలించిన ప్రొఫెసర్ రామదాస్ బృందం భూమికి 1.2 కిలోమీటర్ల దిగువన ఈ వెలకట్టలేని వజ్రాల గనులున్నాయని తేల్చారు. వీటిపై మరింతగా అధ్యయనాలు చేస్తున్నామని తెలిపారు.

English summary
Diamond Mines in Palamuru at Mahabubnagar District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X