హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నాయిని పద్ధతి సరికాదు, మా మధ్య చిచ్చు పెడుతున్నారు!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న జిహెచ్ఎంసీ కార్మికుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. సమ్మె విరమిస్తున్నట్లు శుక్రవారం ఒకరు ప్రకటించగా.. విరమించలేదని మరికొన్ని సంఘాలు ప్రకటించాయి. దీనిపై మిగతా కార్మిక సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి.

సమ్మె విరమణ

ఐదు రోజులుగా చేస్తోన్న జీహెచ్‌ఎంసీ కార్మికుల నిరవధిక సమ్మె చేపట్టారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ సమ్మెను విరమించింది.

ఈ మేరకు ఇవాళ కార్మిక సంఘాల నేతలతో హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌ చర్చలు జరిపారు. చర్చలు సఫలమయ్యాయని చెబుతూ సమ్మె విరమిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంస్థ నేత వినోద్ తెలిపారు.

Differences in workers unions

తమ డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం తరపున కమిషనర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్టు పేర్కొన్నారు. 30 లోగా తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు.
తమ డిమాండ్లను అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంపై మిగతా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్మిక సంఘాల మధ్య చీలికకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా తాము శనివారం అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామన్నారు.

తాము సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే సహించేది లేదన్నారు. కార్మిక సంఘాల నేతగా పని చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పద్ధతి సరికాదని పారిశుద్ధ్య కార్మిక సంఘాల జేఏసి మండిపడింది.

సమ్మె విరమించామని చెబుతున్న టీఆర్ఎస్ కార్మిస సంఘంతో తమకు సంబంధం లేదని చెప్పారు. అసలు ఆ సంఘానికి గుర్తింపే లేదని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. రేపటి నుండి ఉధృతం చేస్తామన్నారు. సీఐటీయు, ఏఐటీయూసి, బిఎంఎస్ తదితర సంస్థలు సమ్మెను కొనసాగిస్తున్నట్లు చెప్పాయి.

English summary
Differences in workers unions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X