వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉర్దూ, అరబిక్ భాషల్లో తల్లి, భార్యతో 27 సార్లు మాట్లాడాడు: భత్కల్‌పై డిఐజి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ సెల్‌పోన్‌లో మాట్లాడి తాను జైలు నుంచి తప్పించుకునేందుకు పథకం వేశానని చెప్పినట్లు వచ్చిన వార్తలపై డిఐజి ఎ. నరసింహ వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు భత్కల్‌కు ల్యాండ్ ఫోన్‌లో మాట్లాడే వెసులుబాటును తాము కల్పించామని ఆయన శనివారం మీడియాతో చెప్పారు.

యాసిన్ భత్కల్ భార్యతో, తల్లితో 27 సార్లు మాట్లాడాడని, అయితే అరబిక్, ఉర్దూ భాషల్లో అతను మాట్లాడాడని డిఐసి చెప్పారు. తాను భత్కల్ కాల్స్‌ను పరిశీలించానని ఆయన చెప్పారు. అరబిక్, ఉర్దూ సంభాషణలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు.

DIG Narasimha says Batkal spoke with his wife and mother

చర్లపల్లి జైలులో 13 మంది ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారని ఆయన చెప్పారు. యాసిన్ భత్కల్ 2014 నవంబర్ 16వ తేదీ నుంచి చర్లపల్లి జైలులో ఉంటున్నాడని, అతని బ్యారక్‌లో మరో ఐదుగురు ముద్దాయిలు ఉన్నారని ఆయన చెప్పారు. యాసిన్ భత్కల్ సెల్‌ఫోన్‌లో మాట్లాడాడనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. యాసిన్ భక్తల్ ఉగ్రవాది కావడంతో తాము ఖైదీలకు కల్పించే ల్యాండ్ లైన్ సౌకర్యాన్ని నిరాకరించామని, అయితే కోర్టు 2015లో ఆ సౌకర్యం భత్కల్‌కు కూడా కల్పించాలని ఆదేశించిందని, కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత ఆ సౌకర్యం కల్పించామని ఆయన వివరించారు.

తాము కల్పించే ల్యాండ్ లైన్‌లో ప్రతిసారీ ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడే సౌకర్యం ఉంటుందని, అంతకు మించి మాట్లాడాలనుకుంటే దానంతటదే లైన్ తెగిపోతుందని ఆయన చెప్పారు. ఆ ఫోన్‌కు ఐఎస్‌డి సౌకర్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఖైదీకి వారంలో రెండు సార్లు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే సౌకర్యం ఉంటుందని, అందుకు అనుగుణంగానే భత్కల్ తన భార్యతో, తల్లితో మాట్లాడాడని ఆయన చెప్పారు.

యాసిన్ భత్కల్ గురించి వార్తలు వచ్చిన వెంటనే తాను ఆకస్మిక తనిఖీ నిర్వహించానని, తనకు ఎటువంటి సెల్ ఫోన్ కూడా కనిపించలేదని ఆయన అన్నారు.

English summary
DIG narsimha clarified that no cell phone is found with Dilsukhanagar bomb blast accuded yasin Batkal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X