వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర,తెలంగాణ సరిహాద్దుల్లో భద్రతను పరిశీలించిన డిఐజి రవివర్మ

By Narsimha
|
Google Oneindia TeluguNews

జయశంకర్ భూపాలపల్లి : ఏఓబి లో ఎన్ కౌంటర్ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. మావోలు గోదావరిని దాటి జయశంకర్ భూపాలపల్లిలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఘటనతో జయశంకర్ జిల్లా సరిహద్దుల్లో భద్రత చర్యలను వరంగల్ రేంజ్ డిఐజీ రవివర్మ పర్యవేక్షించారు.24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. ఏఓబీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం కోసం మావోలు అవకాశం చూస్తుంటారని ఆయన పోలీసలను హెచ్చరించారు.

జయశంకర్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఉన్న మహాదేవ్ పూర్ కు కొత్తగా పోలీస్ సబ్ డివిజన్ మంజూరైంది.పోలీస్ సబ్ డివిజన్ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.ఠాణా భద్రత తదితర అంశాలను ఆయన ఆరా తీశారు.మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు.

 dig ravivarma inspect maharastra,telangana border security

ఒఢిశా ఎన్ కౌంటర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ కూడ మరణించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో మావోలు విద్వంసానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు.24 గంటలపాటు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. గొదావరి ని దాటి జయశంకర్ జిల్లాలోకి మావోలు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.

English summary
dig ravivarma inspect maharastra,telangana border security
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X