వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఇచ్చిన 90వేల కోట్లు ‘కొనుగోళ్ల’కేనా?: కెసిఆర్‌పై డిగ్గీ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అందిన రూ. 90 వేల కోట్లను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోళ్ల కోసమే ఉపయోగించారంటూ ధ్వజమెత్తారు.

18న రైతుల సమస్యలపై బహిరంగసభ

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో అక్టోబరు 17న టీపీసీసీ సమన్వయ కమిటీసమావేశం, 18న రైతుల సమస్యల మీద భారీ బహిరంగసభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యవర్గం, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల సమావేశంలో నిర్ణయించారు.

దిగ్విజయ్

దిగ్విజయ్

కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులకు సోమవారం నుంచి రెండు రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిన సందర్భంగా దిగ్విజయ్ హైదరాబాద్‌కు వచ్చారు.

కెసిఆర్‌పై విమర్శలు

కెసిఆర్‌పై విమర్శలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులను టిఆర్ఎస్ కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు.

సమావేశంలో..

సమావేశంలో..

ప్రాజెక్టుల పేరు చెప్పి పేదల భూములను కేసీఆర్ సర్కారు కొల్లగొడుతోందని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతు హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని మండిపడ్డారు.

ఉత్తమ్ ఫైర్

ఉత్తమ్ ఫైర్

బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకు వెళ్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతుల రుణమాఫీకి డబ్బులులేవనే ప్రభుత్వం రూ.వేల కోట్లు గుత్తేదారులకు ఇస్తోందన్నారు. కేసీఆర్‌ పాలనకు ప్రజలే ముగింపు పలుకుతారని అన్నారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేతలు

2013 నాటి భూసేకరణ చట్టాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వివిధ మతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని దిగ్విజయ్ విమర్శించారు.

దిగ్విజయ్‌తో జానా, ఉత్తమ్

దిగ్విజయ్‌తో జానా, ఉత్తమ్

టిఆర్ఎస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక మాటలకే పరిమితమైందని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి విమర్శించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీ, రాజీవ్‌గాంధీ పంచాయతీ అభియాన్‌ బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌ సహా పలువురు మాట్లాడారు.

దిగ్విజయ్‌తో జైపాల్ రెడ్డి

దిగ్విజయ్‌తో జైపాల్ రెడ్డి

కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియా, సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, ఎంపీలు నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఆనంద భాస్కర్‌, శిక్షణ విభాగం కన్వీనర్‌ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌నేతలు పాల్గొన్నారు.

English summary
AICC general secretary Digivijaya Singh took a dig at Chief Minister, K. Chandrashekar Rao asking whether he has spent the Rs. 90,000 crore given by the Central Government to buy the legislators of opposition parties and to suppress the farmers forcibly acquiring their lands for the proposed projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X