హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌షుక్‌నగర్ జంట పేలుళ్లు: ఆ రోజు ఏం జరిగింది?

2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం... అందరూ కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే వేళ.... అకస్మాత్తుగా దిల్‌షుక్‌నగర్‌లో జంట పేలుళ్లు సంభవించాయి... హాహాకారాలు మిన్నంటాయి..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం ఐదు.. ఐదున్నర గంటల సమయం... అందరూ కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు. దిల్‌షుక్‌నగర్ బసు డిపో, బస్టాండులు బిజీగా ఉన్నాయి. టీ దుకాణాలు కూడా క్రిక్కిరిసి ఉన్నాయి. ఆ సమయంలో వరుసగా రెండు చోట్ల బాంబులు పేలాయి.

ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. దాదాపు 15 మంది ఆ పేలుళ్లలో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది మరణించారు. బాంబు పేలుళ్లకు సమీపంలో భవనాలు భూకంపం వచ్చినట్లు కదిలిపోయాయి. సెల్ ఫోన్లు మూగపోయాయి. దిల్‌షుక్‌నగర్ పరిసరాల్లో నివసించే తమవారి కోసం బయటివాళ్లు ఫోన్లు చేస్తుంటే సమాధానాలు లేవు.

హైదరాబాద్ నగరం దాదాపుగా బిక్కచచ్చిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటనలు జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పేలుళ్లు సంభవించిన తర్వాత అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు సంఘటనా స్థలాలకు, ఆస్పత్రులకు వచ్చారు. బాధితులను పరామర్శించారు. హైదరాబాదు నగరం పూర్తిగా భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

 ఏం జరిగిందో తెలిసే లోగానే 15 మంది.

ఏం జరిగిందో తెలిసే లోగానే 15 మంది.

ఏం జరిగిందో తెలిసే లోగానే 15 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వంద మందికి పైగా గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. దిల్‌షుక్‌నగర్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. బాంబులు రెండు థియేటర్ల వద్ద జరిగాయి. ఈ రెండు థియేటర్ల నుంచి సినిమా చూసి ప్రేక్షకులు బయటకు వచ్చే వేళ. చాలా మంది మార్కెట్ చేసుకునే సమయం. అందరూ కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వచ్చే వేళ. ఆ సమయం చూసే ఉగ్రవాదులు పంజా విసిరినట్లు కనిపిస్తోంది.

 సెల్ ఫోన్లు మూగబోయాయి...

సెల్ ఫోన్లు మూగబోయాయి...

పేలుళ్లు జరిగిన కొద్ది సేపటికి మొబైల్ ఫోన్లు మూగబోయాయి. పలు ప్రాంతాల నుంచి తమ వారి పరిస్థితిని తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తుంటే సమాధానం రాని పరిస్థితి, తీవ్ర ఆందోళన మధ్య తమవారి కోసం వెతుకులాట. ఆస్పత్రుల్లో చేరింది తమవారో కాదో తెలియదు. మరణించినవారిలో తమవారెవరైనా ఉన్నారా అనే ఆందోళన. - రాష్ట్రం ఒక్కసారిగా భయంతో అట్టుడికిని పరిస్థితి.

 చేయని నేరానికి శిక్ష..

చేయని నేరానికి శిక్ష..

చేయని నేరానికి 19 మంది మరణించారు. దాదాపు వంద మంది దాకా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స చేయడానికి ఆఘమేఘాల మీద నర్సులు, వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పడకలపై క్షతగాత్రులు. శవాల పక్కన రక్తమోడుతూ ఓ వ్యక్తి బిక్క చచ్చిపోయి దిక్కులు చూస్తూ... సంఘటనా స్థలం అధికారుల పరిశీలన. ఇండియన్ ముజాహిదీన్ హైదరాబాద్‌ను టార్గెట్ చేసినట్లు హెచ్చరిక చేసిన వార్తాకథనం ఓ పత్రికలో... ఓ హిందీ పత్రికలో హైదరాబాదీ హాహాకారాల చిత్రం.. ఆప్తురాలని కోల్పోయి కంటికీ మింటికీ ఏకధాటిగా రోదిస్తున్న బంధువులు.. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం... ఇలా ఛిన్నాభిన్నమన స్థితి

 మృతుల్లో 14 మంది వీరే..

మృతుల్లో 14 మంది వీరే..

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మరణించినవారి సంఖ్య శుక్రవారం 19కి చేరుకుంది. వారిలో 14 మంది వివరాలను అప్పుడు అధికారులు వెల్లడించారు. మృతులు వీరే - ఖమ్మం జిల్లా చింతూరుకు చెందిన దుర్గాప్రసాద్ (23), నల్లగొండ జిల్లాకు చెందిన రాజేందర్ రెడ్డి (21), హైదరాబాద్ బోరబండకు చెందిన మారుతి (23) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 1. ఎ రాములు (వారాసిగుడా, హైదరాబాద్) 2. ఎజాజ్ అహ్మద్ (ప్రేమ్‌నగర్, అంబర్‌పేట, హైదరాబాద్, పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్థి) 3. మహ్మద్ రఫీ (బాబానగర్, హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో బ్యాగులు కుట్టే వ్యక్తి) 4. ముత్యాల రాజశేఖర్ (ఎంబిఎ), (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం) 5. వడ్డే విజయ్ కుమార్ (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం) 6. హరీష్ కార్తిక్ (దిల్‌షుక్‌నగర్, హైదరాబాద్, స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల) 7. పద్మాకర్ దివాన్‌జీ (కొత్తపేట జిలేబీ తయారీదారుడు) 8. వెంకటేశ్వర రావు (వెటర్నరీ అసిస్టెంట్ మలక్‌పేట్, స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ) 9. స్వప్నారెడ్డ్ి (సంతోష్‌నగర్, ఎంబిఎ విద్యార్థి) 10. ఆనంద్‌కుమార్ (బిటెక్ ఇసిఇ చివరి సంవత్సరం, నోవా కళాశాల, రామోజీ ఫిలం సిటీ వద్ద, స్వస్థలం అనంతపురం జిల్లా, ప్రస్తుతం చైతన్యపురిలోని శ్రీ అంజనేయ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు) 11. తిరుపతయ్య (గోదావరిఖని, కరీంనగర్ జిల్లా) 12. శ్రీనివాసరెడ్డి (రెంటచింతల, గుంటూరు జిల్లా) 13. చోగారం కులాజీ (రాజస్థాన్) 14. గిరి (రామన్నపేట, నల్లగొండ జిల్లా) ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

English summary
In the twin bomb blasts occured at Dilsukhanagar in hyderabad 19 innocent people lost their lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X