హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇరుక్కున్న యాంకర్.. కేసీఆర్‌కు వర్మ విస్కీ ఛాలెంజ్.. అదీ ప్రెస్‌ మీట్‌లో..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ వేళ ఇళ్లకే పరిమితమైన జనాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తూ.. అప్పుడప్పుడు వార్తలు చూస్తూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. నిజానికి గతంతో పోల్చితే లాక్ డౌన్‌ పీరియడ్‌లో న్యూస్ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య పెరిగినట్టుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రెస్‌మీట్ల కోసం జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

ఆయన లైవ్‌లో మాట్లాడుతుంటే.. టీవీ చానెళ్ల వీక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గతంలో కేసీఆర్‌ను ద్వేషించినవారు సైతం.. కరోనాపై ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అంతగా కేసీఆర్ ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ,ఇటు మీడియాలోనూ హైలైట్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కేసీఆర్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు. అది కూడా ఆశామాషీ సవాల్ కాదు..

ఛాలెంజ్ విసరాలన్న యాంకర్..

ఛాలెంజ్ విసరాలన్న యాంకర్..

లాక్ డౌన్ వేళ వీక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని చానెళ్లు సినీ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. లాక్ డౌన్ పీరియడ్‌ను ఎలా గడుపుతున్నారు.. కొత్త కథలేమైనా రాస్తున్నారా అని ఆరా తీస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ యాంకర్ కూడా రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం సినీ సర్కిల్‌లో లాక్ డౌన్ ఛాలెంజ్ ట్రెండ్ బాగా పాపులర్ కావడంతో.. సదరు యాంకర్‌ కూడా వర్మను ఎవరికైనా ఛాలెంజ్ విసురుతారా..? అని ప్రశ్నించారు. దానికి వర్మ.. 'నేను ఎవరి మాట వినను.. నా మాట వినమని ఎవరికీ చెప్పను. కాబట్టి ఛాలెంజ్‌ విసరడం కాని పని.' అని తేల్చేశారు.

కేసీఆర్ ప్రెస్ మీట్‌లో విస్కీ తాగాలన్న వర్మ..

కేసీఆర్ ప్రెస్ మీట్‌లో విస్కీ తాగాలన్న వర్మ..

కానీ సదరు యాంకర్ మాత్రం వర్మను వదల్లేదు. ఒకవేళ మీరు పవన్ కల్యాణ్‌కి ఛాలెంజ్ ఇస్తే ఏ ఛాలెంజ్ ఇస్తారని ప్రశ్నించారు. దానికి వర్మ.. పవన్ ఎందుకులే గానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నానని చెప్పారు. అదేంటంటే.. లాక్ డౌన్ పీరియడ్‌లో కేసీఆర్ ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు.. అందరి ముందు ఒక గ్లాస్ విస్కీ తాగాలని ఛాలెంజ్ విసిరారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది మద్యం దొరక్క అల్లాడిపోతున్నారని.. కాబట్టి అలాంటివాళ్లంతా కుళ్లుకుని చచ్చిపోయేలా అందరి ముందు కేసీఆర్ విస్కీ పెగ్ వేయాలని అన్నారు.

ఖంగు తిన్న యాంకర్..

ఖంగు తిన్న యాంకర్..

వర్మ విసిరిన ఈ ఛాలెంజ్‌కి సదరు యాంకర్ ఖంగుతిన్నారు. మిమ్మల్ని అనవసరంగా ఛాలెంజ్ అడిగి రిస్క్‌ చేశామోనని అన్నారు. ఏదో ఛాలెంజ్ చేయమని అడిగినందుకు.. ఏకంగా కేసీఆర్ గారికే గురిపెట్టారు.. అదీ విస్కీ తాగమంటున్నారు.. ఏంటిదంతా అన్నట్టుగా యాంకర్ వర్మను ప్రశ్నించారు. దాని వర్మ.. కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో కూర్చొని తాగుతున్న విజువల్స్.. దానికి ప్రజల రియాక్షన్ చూసి వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే అదిరిపోద్ది అంటూ తన ఐడియా గురించి చెప్పాడు. దానికి ఆ యాంకర్.. ఇంతకీ మీరు వైన్ షాప్స్ ఓపెన్ చేయాలని అడుగుతున్నారా అని ప్రశ్నించారు. ఓపెన్ చేయమని తాను చెప్పట్లేదని.. కానీ ఇలాంటి టైమ్‌లో కేసీఆర్ మందు తాగితే పెద్ద విలన్‌గా కనిపిస్తారని.. ఆ బాధలో కరోనాను మరిచిపోతారని చెప్పుకొచ్చారు.

Recommended Video

Ram Gopal Varma Mocks Trump Claim || Oneindia
నెగటివ్ కామెంట్స్..

నెగటివ్ కామెంట్స్..

వర్మ విసిరిన ఈ ఛాలెంజ్‌పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలాంటి ఛాలెంజ్‌లు చేయడం సరికాదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. నిన్న గాక మొన్ననే కేసీఆర్ మీ టీవీ చానెల్ సర్వే గురించి ప్రెస్ మీట్‌లో ప్రస్తావించారని.. ఇంతలోనే ఇలాంటి చెత్త ఛాలెంజ్‌లా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలే మంత్రి కేటీఆర్‌కు సైతం రాంగోపాల్ వర్మ ఆల్కాహాల్ గురించి ఓ ట్వీట్ చేశారు. 'చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.. మానసిక సమస్యలతో మెంటల్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొంతమంది ఫ్రస్టేషన్‌లో భార్యలపై కూడా దాడులు చేస్తున్నారు. మీరు కూడా వీరి పట్ల మమతా బెనర్జీ లాగా పెద్ద మనసు చాటుకోవాలి.' అని కేటీఆర్‌కు వర్మ విజ్ఞప్తి చేశారు.వర్మ ట్వీట్‌పై ఫన్నీగా స్పందించిన కేటీఆర్.. 'రాము గారు, మీరు చెబుతున్నది హెయిర్ కట్ గురించే కదా..' అని పెద్ద సెటైర్ వేశారు.

English summary
Director Ramgopal Varma made a controversial challenge to Telangana Chief Minister KCR in a TV channel live interview. Varma challenges KCR to drink whiskey in press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X