హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యజమాని కోరిక: అద్దె చెల్లించలేరా, నీ కూతురితో నా పెళ్ళి చేయండి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయిన 38 ఏళ్ళ వ్యక్తి మైనర్‌ బాలికను వివాహం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి కూతురును రమేష్ అనే వ్యక్తి వివాహం చేసుకొనేందుకు చేసిన ప్రయత్నాన్ని చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులు బుధవారం నాడు అడ్డుకొన్నారు. అద్దె కట్టలేని కారణంగా అద్దెకు ఉంటున్న వ్యక్తి కూతురును పెళ్ళి చేసేందుకు చేసిన ప్రయత్నాలను చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులు అడ్డుకొన్నారు. అంతేకాదు పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి హైద్రాబాద్‌కు 15 ఏళ్ళ క్రితం వచ్చాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు.

హైద్రాబాద్ కాటేదా‌న్‌లోని రమేష్ అనే వ్యక్తి ఇంట్లో ఒడిశా నుండి వచ్చిన వ్యక్తి అద్దెకు దిగాడు. కూలీ పనులు దొరకడం కష్టంగా మారింది. దీంతో అద్దె కూడ చెల్లించడం వలసకూలీకి కష్టంగా మారింది. దీంతో ఇంటి యజమానికి దుర్భుద్ది పుట్టింది.

అద్దె కట్టకపోతే కూతురితో పెళ్ళి చేయండి

అద్దె కట్టకపోతే కూతురితో పెళ్ళి చేయండి

ఒడిశా రాష్ట్రం నుండి బతుకుదెరువు కోసం ఓ వ్యక్తి హైద్రాబాద్‌కు 15 ఏళ్ళ క్రితం వచ్చాడు. అయితే కూలీ పనులు చేసుకొంటూ అతను జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ఇటీవలనే ఓ కూతురు పదవతరగతి పాసైంది. ఈ కుటుంబం కాటేదాన్‌లోని రమేష్‌ అనే వ్యక్తి కుటుంబంలో అద్దెకు ఉంటుంది. అయితే కూలీ పనులు దొరకని కారణంగా కుటుంబ పోషణ కూడ కష్టంగా మారింది. ఇంటి అద్దె కూడ కట్టడం కష్టంగా మారింది.. ఇంటి యజమాని రమేష్ కు 38 ఏళ్ళు,. కాళ్లు, చేతులు కూడ చచ్చుబడిపోయాయి. పదో తరగతి పాసైన అమ్మాయిని తనకిచ్చి వివాహం చేయాలని వలస కూలీని రమేష్ కోరారు. అయితే ఈ విషయమై అతను నిరాకరించాడు.

ఇంటి నుండి వెళ్ళిపోయిన తండ్రి

ఇంటి నుండి వెళ్ళిపోయిన తండ్రి

అద్దె డబ్బులు చెల్లించడం లేదంటూ వలసకూలీ కూతురిని తనకు ఇచ్చి వివాహం చేయాలని ఇంటి యజమాని రమేష్ ఒత్తిడి తెచ్చాడు. అయితే రమేష్ ఒత్తిడిని బాలిక తండ్రి అంగీకరించలేదు. ఈ విషయమై భార్య, భర్తల మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. ఈ బాధ భరించలేక భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాడు. కాళ్ళు, చేతులు చచ్చుబడిన రమేష్ తో బాలికను ఇచ్చి వివాహం చేసేందుకు బాలిక తల్లి మాత్రం సుముఖంగా ఉంది.

పెళ్ళికి బాలిక తల్లి ఓకే

పెళ్ళికి బాలిక తల్లి ఓకే

భార్యతో గొడవ పడి భర్త ఇంటి నుండి వెళ్ళిపోవడంతో రమేష్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.ఈ తరుణంలో బుధవారం నాడు రమేష్‌తో తన కూతురు వివాహం చేయాలని తల్లి నిర్ణయం తీసుకొంది. వివాహనికి అన్ని ఏర్పాట్లు చేశారు. తన తల్లి మాటకు ఎదురుచెప్పలేక ఆ బాలిక కూడ వివాహనికి అంగీకరించింది. అయితే ఎట్టకేలకు ఆ బాలిక బతుకు బుగ్గిపాలు కాకుండా ఉండేలా ఓ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు.

పెళ్ళిని ఆపిన చైల్డ్ లైఫ్ సిబ్బంది

పెళ్ళిని ఆపిన చైల్డ్ లైఫ్ సిబ్బంది

రమేష్ తో మైనర్ బాలిక వివాహం జరుగుతుందన్న విషయాన్ని బాలిక సోదరుడు ఛైల్డ్ లైఫ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఛైల్డ్ లైఫ్ ప్రతినిధులు బుధవారం నాడు వివాహం జరిగే ప్రాంతానికి చేరుకొని వివాహన్ని నిలిపివేయించారు. అంతేకాదు ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
physically handicapped house owner Ramesh trying to marry minor girl on Wednesday. Child life delegates stopped this marriage.police registered a case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X