• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ్‌భవన్‌లో ఆసక్తికర సీన్-పక్కకు వెళ్లి మాట్లాడుకున్న కోమటిరెడ్డి,రేవంత్-దాని పైనే చర్చ...?

|

కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఖరారైందని ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం(జూన్ 4) తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చి బయటకొస్తున్న క్రమంలో ఎంపీలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పక్కకు తీసుకెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఏకాంతంగా కొద్ది నిమిషాల పాటు ముచ్చటించినట్లు సమాచారం.టీపీసీసీ చీఫ్ పదవి పైనే ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పదవి ఎవరికి దక్కినా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. ముందు నుంచి ఈ ఇద్దరి పేర్లే టీపీసీసీ చీఫ్ రేసులో ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.

discussion between revanth reddy and komati reddy over tpcc chief post

టీపీసీసీ చీఫ్ పదవికి సంబంధించి కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించారు. పార్టీలోని సీనియర్లు,కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి కేంద్రానికి పంపించారు. నివేదికను పరిశీలించిన హైకమాండ్... ఒకానొక దశలో రేవంత్ రెడ్డికి పదవి ఖరారు చేసినట్లు లీకులు వచ్చాయి. అయితే అప్పట్లో సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో హైకమాండ్ ఆ విషయంలో ముందుకు వెళ్లలేదు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకూ వేచి చూసి ఆ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావించింది.

ఇప్పటికీ కాంగ్రెస్‌లో వీహెచ్ లాంటి సీనియర్లు బాహాటంగానే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవిని బీసీలకు లేదా సీనియర్లకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా పదవి ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరో సీనియర్ నేత,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా రేసులో ఉన్నారని గతంలో ప్రచారం జరిగింది. హైకమాండ్ ఆయన పేరే ఖరారు చేసిందని... ఇక ప్రకటించడమే తరువాయి అని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

గత మూడు,నాలుగు రోజులుగా పీసీసీ చీఫ్ పదవిపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికే ఆ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషం వరకూ ఏది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేపథ్యంలో మరో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకొనైనా కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై త్వరలోనే తేల్చే సూచనలు కనిపిస్తున్నాయి.

  TPCC President : Revanth Reddy కే పీసిసి పగ్గాలు ? పార్టీకి నష్టమన్న VH || Oneindia Telugu

  కాగా,తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేయాలని, రాష్ట్రంలో కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలని, ఇప్పటివరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు చెల్లించిన డబ్బులను బాధితులకు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.

  English summary
  In an interesting development there is a discussion took place between MP's Revanth Reddy and Komati Reddy at Raj Bhavan while they were returning after submitting a letter to governor.It is learnt that both were discussed about TPCC chief post,which congress high command will announce soon.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X