వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య మృతిచెందారు. చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ జరిగిన కొద్దిరోజులకు ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స పొందిన ఆయన్ను ఇటీవలే స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఆయన మృతి చెందారు.

ఇంటిని పోషించే చెన్నకేశవులు,కురమయ్య ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెకు ఆర్థిక సాయం చేయాలంటూ ట్విట్టర్‌లో విజ్ఞప్తి కూడా చేశారు.

disha accused chennakesavulu father died

కాగా, హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు వ్యక్తులు అత్యాచారం,హత్య చేసిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజా వెనకాల ఆమెపై అత్యాచారం తర్వాత చటాన్‌పల్లి అండర్ పాస్ సమీపంలో ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి కాలబెట్టారు. ఇందులో చెన్నకేశవులు ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్, ఎన్‌కౌంటర్ ఇలా అన్నీ చక,చకా జరిగిపోయాయి.

Recommended Video

Disha Case : పోలీసులు సైతం నివ్వెరపోయేలా: తొమ్మిది హత్యలు! || Oneindia Telugu

సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులను చర్లపల్లి జైలు నుంచి చటాన్‌పల్లి వద్దకు తీసుకెళ్లగా.. వారు పోలీసుల పైకి తిరగబడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అన్న ఆరోపణలతో మానవ హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. దీనిపై మానవ హక్కుల కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది.

English summary
Kurmaiah,Father of Disha accused Chennakesavulu is died at his home in Narayanapet District on Monday. After Chennakesavulu encounter Kurmaiah severly injured in an accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X