హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిందితుల అంత్యక్రియలకు చిక్కులు, ఆ భూమి తమది, మరోచోట తప్పని గోతులు..

|
Google Oneindia TeluguNews

దిశ హత్య కేసు నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కొచ్చి పడింది. గుడికండ్ల శ్మశానంలో గోతులు తవ్వగా, ఆ భూమి తమదని కొందరు అంటున్నారు. దీంతో నిందితులను ఎక్కడ పాతిపెట్టాలనే ప్రశ్న తలెత్తింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గ్రామం నుంచి నేరుగా శ్మశానానికే మృతదేహాలను తీసుకెళ్తామని పోలీసులు స్పష్టంచేశారు. ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వబోమని.. పొలంలో దహనం చేసేందుకు పర్మిషన్ లేదని పోలీసులు తేల్చిచెప్పారు.

Disha case encounter:వణుకుపుట్టాలి: దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై రోజా స్పందనDisha case encounter:వణుకుపుట్టాలి: దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై రోజా స్పందన

 సర్వే నంబర్ 12

సర్వే నంబర్ 12

గుడికండ్ల శ్మశానాన్ని అనుకొని సర్వేనంబర్ 12 ఉంది. ఇక్కడ మేక వెంకటమ్మ అనే మహిళ, కుటుంబసభ్యులకు మూడెకరాల ఆరు గుంటల భూమి ఉంది. భూమిని అనుకొని మూడు గోతులు తవ్వారు. దీంతో వెంకటమ్మ, ఆమె ఇద్దరు మరిదులు ఆందోళన చేపట్టారు. తమ పట్టా భూమిలో గోతి తవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తమ జాగాలో చేయడం సరికాదని పేర్కొంటున్నారు.

 3.6 ఎకరాల భూమి

3.6 ఎకరాల భూమి

వెంకటమ్మ భర్త, ఆయన అన్నదమ్ములకు మూడెకరాల ఆరు గుంటల భూమి ఉన్నది. ఒక్కొక్కరి ఎకరం భూమి ఉంది. మరో చోట మూడెకరాల భూమి ఉండేదని.. కానీ రైల్వే కట్టకు పోయిందని చెప్తున్నారు. ఈ భూమే తమ జీవనాధారం అని చెప్తున్నారు. భూమికి సంబంధించి పాస్ బుక్కు ఉందని చెప్తున్నారు. సిటీలో ఉన్న కుమారుడు చెబితే పొలం వద్దకొచ్చామని తెలిపారు.

మరో చోట..

మరో చోట..

వెంకటమ్మ, ఆమె మరిది ఆందోళనతో అధికారులు మరో చోట గోతి తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్మశానంలోనే మరో చోట గోతులు తవ్విస్తున్నారు. వెంటనే మక్తల్ నుంచి ప్రొక్లెయిన్ తెప్పించారు. నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులు చర్యతో యావత్ జాతి ముక్తకంఠంతో ఖండిస్తుంటే.. వారి ఖననం తమ జాగాలో చేయడంపై రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు.

 అలా పరిచయం

అలా పరిచయం

మహ్మద్‌కు శివ, నవీన్, చెన్నకేశవులు ఇదివరకే పరిచయం అని స్థానికులు చెప్తున్నారు. లారీ డ్రైవర్ కన్నా ముందు మహ్మద్.. స్థానికంగా ఉన్న బంక్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలో శివ, నవీన్, చెన్నకేశవులు కూడా చేరారు. అప్పటినుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది. మహ్మద్ లారీ డ్రైవర్‌గా మారాగా శివను క్లీనర్‌గా పెట్టుకున్నాడు. మిగతా ఇద్దరు లోడింగ్, ఆన్ లోడింగ్ కోసం సాయం తీసుకుంటారు. అలా నలుగురు కలిసే పనిచేస్తున్నారు. లారీలో ఇనుప సామానులు తరలించేవారు. దొంగిలించిన వస్తువును వేరే చోట పెట్టి.. విక్రయించేవారని స్థానికులు చెప్తున్నారు.

English summary
disha accused cremation face difficulties. some one told land belongs to our self.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X