హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్, మృతదేహలను భద్రపరచండి, ఎన్‌హెచ్ఆర్సీ పరిశీలన..

|
Google Oneindia TeluguNews

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కలు కమిషన్ స్పందించింది. తాము పరిశీలించే వరకు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించొద్దని స్పష్టంచేశాయి. శుక్రవారం సాయంత్రం తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు అందాయి. దీంతో దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో ఉంచే అవకాశం ఉంది.

శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు మహబూబ్‌నగర్ వస్తారు. అక్కడ నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తారు. ఇదిలాఉంటే మరోవైపు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.

disha accused dead bodies Keep it hospital until monday:high court

కేసును హైకోర్టు విచారణకు స్వీకరించింది. నిందితుల మృతదేహాలను సోమవారం వరకు మహబూబ్ నగర్ ఆస్పత్రిలో భద్రపరచాలని స్పష్టంచేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ లేరని.. సోమవారం పిటిషన్ విచారిస్తామని పేర్కొన్నది. డీజీపీ సహా ఇతర అధికారులకు నోటీసులు జారీచేసింది. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న వారి వివరాలు అందజేయాలని సూచించింది. అలాగే శవ పరీక్ష వీడియోను మహబూబ్ నగర్ జిల్లా జడ్జికి ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌ను సోమవారం ఉదయం 10.30 గంటలకు విచారిస్తామని పేర్కొన్నది.

English summary
disha accused dead bodies Keep it hospital until monday high court said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X