హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితుల ఎన్‌కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్‌పల్లి వద్దకు ఎన్‌హెచ్‌ఆర్సీ, మీడియాకు..

|
Google Oneindia TeluguNews

దిశపై లైంగికదాడి చేసి, హతమార్చిన నిందితుల మృతదేహాలను జాతీయ మావన హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలను చూశారు. వారికి బుల్లెట్ ఎక్కడ తగిలాయో గమనించారు. ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులతో మహబూబ్‌నగర్‌, నారాయణపేట ఎస్పీలు రెమా రాజేశ్వరి, చేతన ఉన్నారు.

Disha case encounter : దిశ ఘటన ఆ సినిమాలో .. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలుసా !Disha case encounter : దిశ ఘటన ఆ సినిమాలో .. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలుసా !

విడివిడిగా చర్చలు

విడివిడిగా చర్చలు

ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులతో మాట్లాడారు. వారు పోస్టుమార్టానికి సంబంధించిన వీడియోను కూడా అందజేశారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులతో విడివిడిగా చర్చలు జరిపారు. ఒక్కో నిందితుడి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు. ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులతో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.

 ఫ్యామిలీ మెంబర్స్‌తో

ఫ్యామిలీ మెంబర్స్‌తో

నిందితుల స్వగ్రామానికి కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు వెళతారని ప్రచారం జరిగింది. కానీ కుటుంబసభ్యులను ఆస్పత్రి వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులకు వివరించారు. పాలమూరు జిల్లా ఆస్పత్రి నుంచి నేరుగా చటాన్ పల్లికి వెళతారని తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత మీడియాకు నోట్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇలా బ్రేక్

ఇలా బ్రేక్

మరోవైపు సోమవారం హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. దీంతో ఆస్పత్రి వద్దనే నిందితుల మృతదేహాలను ఉంచుతారు. సోమవారం హైకోర్టు విచారణ ముగిసిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. వాస్తవానికి శుక్రవారం రాత్రిలోగా నిందితుల అంత్యక్రియలు జరగాలి. కానీ ఎన్‌హెచ్‌ఆర్సీ, హైకోర్టు నోటీసుల నేపథ్యంలో మృతదేహాలను ఆస్పత్రిలోనే ఉంచారు.

ఉత్కంఠ

ఉత్కంఠ

ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఏం చెబుతారా అనే ఉత్కంఠ నెలకొంది. రీ పోస్టుమార్టం అంటారా ? లేదంటే ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. కానీ దిశ నిందితులకు తగిన శాస్తి జరిగిందిన యావత్ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతుంది. నిందితులపై పోలీసులు కావాలని కాల్పులు జరపలేదని, అలాంటి పరిస్థితి కల్పించారని కొందరు అంటున్నారు. చేసేదేమీ లేక పోలీసులు కాల్పులు జరిపారని గుర్తుచేస్తున్నారు. కానీ మానవ హక్కుల పేరుతో ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు.. నిందితులు మృతదేహాలు, ఘటనాస్థలాన్ని పరిశీలిస్తోంది.

English summary
disha accused dead bodies observed by nhrc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X