హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అమెరికా రేడియోలో ప్రసారం..

|
Google Oneindia TeluguNews

దిశ హత్య కేసు దశదిశలా వ్యాపించింది. ఖండంతరాలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా దిశ ఘటనను పలువురు ఖండించారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై అమెరికా రేడియో కూడా ప్రస్తావించింది.

<strong>తుపాకులు ఇచ్చింది... షో కోసం కాదు... దిశ ఎన్‌కౌంటర్‌లో మద్దతు పలికిన ఎంపీ</strong>లుతుపాకులు ఇచ్చింది... షో కోసం కాదు... దిశ ఎన్‌కౌంటర్‌లో మద్దతు పలికిన ఎంపీలు

దిశ హత్య నిందితుల ఎన్ కౌంటర్ గురించి యావత్ దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంది. శుక్రవారం ఉదయం. 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. మన కాలమానం ప్రకారం అమెరికా రేడియో దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ గురించి ప్రస్తావించింది. నేషనల్ పబ్లిక్ రేడియో వార్తను ప్రసారం చేసింది.

disha accused encounter on america radio

దిశ లైంగికదాడి కేసులో నిందితులను పోలీసులు తుపాకులతో కాల్చేశారు. దిశ హత్య జరిగిన ప్రాంతానికి విచారణ నిమిత్తం తీసుకెళ్తుండగా పారిపోయే ప్రయత్నించారని పేర్కొన్నారు. తిరగబడటంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారని తెలిపారు. ఈ మేరకు ఎన్‌పీఆర్ వార్తను ప్రసారం చేసింది. ఇప్పుడే కాదు అంతకుముందు దిశపై లైంగికదాడి, హత్యను కూడా ఎన్‌పీఆర్ వార్తలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

మహ్మద్‌కు శివ, నవీన్, చెన్నకేశవులు ఇదివరకే పరిచయం అని స్థానికులు చెప్తున్నారు. లారీ డ్రైవర్ కన్నా ముందు మహ్మద్.. స్థానికంగా ఉన్న బంక్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలో శివ, నవీన్, చెన్నకేశవులు కూడా చేరారు. అప్పటినుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది. మహ్మద్ లారీ డ్రైవర్‌గా మారాగా శివను క్లీనర్‌గా పెట్టుకున్నాడు. మిగతా ఇద్దరు లోడింగ్, ఆన్ లోడింగ్ కోసం సాయం తీసుకుంటారు. అలా నలుగురు కలిసే పనిచేస్తున్నారు. లారీలో ఇనుప సామానులు తరలించేవారు. దొంగిలించిన వస్తువును వేరే చోట పెట్టి.. విక్రయించేవారని స్థానికులు చెప్తున్నారు.

English summary
disha accused encounter on america radio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X