హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలా .. వాళ్ళందరినీ ఎన్ కౌంటర్ చెయ్యండి .. చెన్నకేశవులు భార్య ధర్నా

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌ లో మృతి చెందిన వారి కుటుంబాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలు తీశారని మృతుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. షాద్ నగర్, చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్కౌంటర్ పై చెన్నకేశవులు భార్య తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నారు . గ్రామంలో ధర్నా చేసిన ఆమె పోలీసులను , ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Disha case:మృతుల కుటుంబాల ఆవేదన ..నా భర్తతో పాటు నన్ను కూడా చంపెయ్యండన్న చెన్నకేశవులు భార్యDisha case:మృతుల కుటుంబాల ఆవేదన ..నా భర్తతో పాటు నన్ను కూడా చంపెయ్యండన్న చెన్నకేశవులు భార్య

నిండు గర్భిణీ అన్న జాలి లేకుండా భర్తను చంపారన్న చెన్నకేశవులు భార్య

నిండు గర్భిణీ అన్న జాలి లేకుండా భర్తను చంపారన్న చెన్నకేశవులు భార్య

చెన్నకేశవులు భార్య గర్భిణి కావటంతో చెన్నకేశవులు ఆమెను పుట్టింటికి పంపిన క్రమంలో జరిగిందీ ఘటన . దీనిపై చెన్నకేశవులు భార్య లక్ష్మీ కన్నీరు మున్నీరు అవుతుంది. నిండు గర్భిణీ అన్న జాలి కూడా లేకుండా తన భర్తను చంపారని లబోదిబోమంటుంది. తన భర్త తప్పు చేశాడని పోలీసులు కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని ఆమె అంటుంది. కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం మంచిది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 రేప్ కేసుల నిందితులను అందరినీ కాల్చి చంపండి అని ఆగ్రహం

రేప్ కేసుల నిందితులను అందరినీ కాల్చి చంపండి అని ఆగ్రహం

ఇది అన్యాయం అని ఆమె పేర్కొంది. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది.అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు నా మొగుడితో సహా నలుగురిని చంపారని.. ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని అందరినీ కూడా చంపేయాలని చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది.దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య పోలీసుల తీరుపై ధర్నా చేసింది.

చంపటం, పూడ్చటం అంతా మీ ఇష్టమేనా .. అసలు మీరెవరు అని పోలీసులకు ప్రశ్న

చంపటం, పూడ్చటం అంతా మీ ఇష్టమేనా .. అసలు మీరెవరు అని పోలీసులకు ప్రశ్న

తన గ్రామస్థులతో కలిసి స్వగ్రామంలో రహదారిపై బైఠాయించి తన భర్త శవాన్ని తనకే అప్పగించాలని, ఇష్టమొచ్చినకాడ పూడ్చిపెట్టడానికి అసలు పోలీసులు ఎవరూ అంటూ ఆమె నిలదీసింది . చంపడం, పూడ్చడం కూడా మీ ఇష్టమేనా , మీ బాధ్యతనేనా ఆమె పోలీసుల తీరును ప్రశ్నించింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా తన భర్తను చంపారని, మీకు మానవత్వం ఉందా అని పోలీసులపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది.

Recommended Video

Disha Issue : NHRC Issues Notices To Telangana Police On Encounter In Disha Case
 నా భర్తతో పాటే పూడ్చి పెట్టండి అంటున్న చెన్నకేశవులు భార్య

నా భర్తతో పాటే పూడ్చి పెట్టండి అంటున్న చెన్నకేశవులు భార్య

ఈ ఎన్ కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రాణాలు తీయటం సంతోషమా అని ఆమె ప్రశ్నించింది. కానీ గతంలో ఇలాంటి ఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె ధర్నా చేసింది . భర్త శవాన్ని తనకు అప్పగించకపోతే తనను కూడా ఆ గోతిలోనే పూడ్చిపెట్టాలని చెన్నకేశవులు భార్య పోలీసులను డిమాండ్ చేస్తుంది. ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారని చెన్నకేశవులు భార్య ఆవేదనతో చెప్పింది. దిశ చెల్లెలికి బదులు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని ఆమె పేర్కొంది.

English summary
Chennakeshavulu's wife told that it is injustice for their family. She said that many cases have been reported in the state. police have to do encounter all the accused . She told that police killed all the four before the court giving justice. she protested in her village against police .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X