హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case encounter:దిశ తండ్రి, సోదరిని విచారించిన ఎన్‌హెచ్ఆర్‌సీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్‌సీ) తన విచారణ కొనసాగిస్తోంది. ఆదివారం సాయంత్రం విచారణలో భాగంగా దిశ తండ్రి, సోదరి జాతీయ మానవ హక్కుల సంఘం బృందం ఎదుట హాజరయ్యారు.

శంషాబాద్‌లో దిశ నివాసానికి వచ్చిన పోలీసులు.. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో దిశ తండ్రి, సోదరిని తెలంగాణ పోలీస్ అకాడమీకి తీసుకెళ్లారు. జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు అరగంటపాటు దిశ తండ్రి, సోదరిని విచారించి వివరాలు సేకరించారు.

Disha case encounter: NHRC team inquiries Dishas father and sister

నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఘటన జరిగిన రోజు, ఆ తర్వాతి రోజు పరిణామాలపై జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, మొదట ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు.

దిశ దశ దిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో దిశ కుటుంబసభ్యులకు మద్దతుగా స్థానికులు కూడా నిలిచారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికి దిశ నివాసానికి చేరుకున్న పోలీసు అధికారులు.. దిశ తండ్రి, సోదరిని ఒప్పించి ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణకు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు.

దిశ తల్లి అనారోగ్యంపాలు కావడంతో ఆమె విచారణకు హాజరుకానట్లు తెలిసింది.
నిందితుల దాడిలో గాయాలపాలైన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ను కూడా ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు విచారించి, వారి వాంగ్మూలాలను కూడా తీసుకోనున్నట్లు తెలిసింది.

కాగా, దిశను అత్యారం చేసి, హత్య చేసిన కేసులో నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్య జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన సెల్‌ఫోన్, వాచీ, పవర్ బ్యాంక్ పాతిపెట్టిన ప్రదేశాలను చూపించారు. ఈ సమయంలోనే నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు.

అంతేగాక, పోలీసుల దగ్గర్నుంచి తుపాకీలను లాక్కున్నారు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు. లొంగిపోవాలంటూ పోలీసులు కోరినప్పటికీ నిందితులు వినకుండా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు నిందితులను మట్టుబెట్టారు. నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు.

English summary
Disha case encounter: NHRC team inquiries Disha's father and sister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X