హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case encounter: దిశ నిందితుల ఎన్ కౌంటర్.. తెలంగాణా ప్రభుత్వానికి విజయశాంతి విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత దిశను హతమార్చిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మరో మరో దేశం దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ ఘటనపై ఎవరికి వారు తమదైన శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మెజారిటీ ప్రజలు ఇలాంటి ఘటనలో పోలీసులు ఇదే విధంగా రియాక్ట్ అవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తే, మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

చదవండి: Disha case encounter : ఎన్ కౌంటర్ లకు తాను వ్యతిరేకం అంటున్న అసదుద్దీన్ ఓవైసీ

ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, నేరస్తులను శిక్షించడం కరెక్ట్ అని చెప్పిన విజయశాంతి , ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటం కోసం ముందుగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .ఘోర నేరానికి పాల్పడిన నలుగురికి తగిన శిక్ష పడిందని విజయశాంతి పేర్కొన్నారు.

Disha case encounter : Vijayashanthi appeals to Telangana government

దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై మాట్లాడిన ఆమె ఆ నలుగురు మానవత్వాన్ని మంట గలిపారని, అలాంటి వాళ్ల విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. మున్ముందు ఇలాంటి ఎన్ కౌంటర్లు అవసరంలేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆమె స్పష్టం చేశారు. మహిళలు ఎలాంటి భయం లేకుండా సంచరించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విజయశాంతి ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

English summary
Speaking about the encounter Vijayashanti said that the four men are the human beasts and that there was no need to talk about human rights. Earlier, she asserted that the government had the responsibility of providing such environments of women safety in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X