హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశా కేసు... ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కీలక సాక్ష్యాలు .. మొత్తం ఎపిసోడ్ పై నివేదికలు ఇచ్చిన సైబరాబాద్ పోలీ

|
Google Oneindia TeluguNews

దిశ అత్యాచారం,హత్య,ఆపై నిందితుల ఎన్కౌంటర్ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ బృందం అన్ని అంశాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతుంది. ఇప్పటికే సంఘటన స్థలాలను పరిశీలించి,ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించి,ఇటు దిశ తల్లిదండ్రుల తోనూ, అటు ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతోనూ మాట్లాడారు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు. ఇక తాజాగా పోలీసులతో కూడా మాట్లాడిన సభ్యులు పోలీసుల వద్ద నుండి కీలక ఆధారాలను తీసుకున్నారు.

దిశా కేసులో షాకింగ్ ట్విస్ట్ .. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?దిశా కేసులో షాకింగ్ ట్విస్ట్ .. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?

ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుల బృందాన్ని కలిసి పోలీసులు దిశ హత్య కేసుకు సంబంధించి ఆమెపై రేప్ జరిగినట్టు,అలాగే హత్యను కూడా నిందితులే చేసినట్లుగా కీలక ఆధారాలు ఇచ్చారు. ఇక అంతే కాదు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదికను,దిశ కాల్చివేత కు సంబంధించిన ఆధారాలతో సహా అన్ని ఆధారాలను సైబరాబాద్ పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందానికి ఇచ్చారు. దిశ కేసులో కీలకంగా ఉన్న శాస్త్రీయ ఆధారాలు అన్నింటిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు పెట్టిన సైబరాబాద్ పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను కూడా సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ముందుంచారు.

Disha case ... key evidence for NHRC .. Cyberabad police reported on the entire episode

ఘటనా స్థలం తో పాటు లారీ జరిగిన సీసీటీవీ ఫుటేజీని కమిషన్ ముందు ఉంచిన పోలీసులు, కొత్తూరు సమీపంలో నిందితులు కొన్న పెట్రోల్ తాలూకు సిసిటివి ఫుటేజ్ ను కూడా అందించారు. ఇక అంతే కాదు రక్తపు మరకల ఆధారంగా డీఎన్ఏ రిపోర్ట్ తో పాటుగా అన్ని నివేదికలను పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు ఇచ్చారు. ఇక అంతే కాదు ఈ కేసుకు సంబంధించి, అన్ని రకాలైన వివరాలను తేదీలు, టైం లతో సహా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు ఉంచిన పోలీసులు దిశ అత్యాచారం,హత్య చేసింది వారేనని,సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకునే క్రమంలో దాడిచేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎన్కౌంటర్ చేశామని ఎన్కౌంటర్ కు సంబంధించిన ఆధారాలను సైతం జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుంచారు.

English summary
Cyberabad police gave evidence to the group of NHRC members who are inquiring on the disha murder case and accused encounter. Moreover, the report by forensic experts and all evidence including the disha set ablaze report was given to the NHRC team by Cyberabad Police. All of the key scientific evidence in the disha case was put before the NHRC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X