హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ లివర్‌లో భారీగా లిక్కర్, బలవంతంగా మందుతాగించిన చెన్నకేశవులు, ఇతర కేసుల్లో సరిపోలిన డీఎన్ఏ

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులు దిశకు బలవంతంగా మద్యం తాగించారని.. తర్వాతే అఘాయిత్యానికి ఒడిగట్టారని పేర్కొన్నది. నిందితుల డీఎన్ఏ రిపోర్టులో కూడా కీలక విషయాలు బహిర్గత పడ్డాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ మీడియాకు చెప్పినట్టు.. గతంలో చేసిన నేరాలతో మ్యాచ్ అవుతుంది.

YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!YS Jagan: దిశ చట్టం ఆమోదంపై విద్యార్థినుల్లో హర్షాతిరేకాలు: కొండంత అండగా..!

లివర్‌లో లిక్కర్

లివర్‌లో లిక్కర్

దిశ శరీరంలో ఫోరెన్సిక్ నిపుణులు భారీగా మద్యం గుర్తించారు. మద్యం తాగడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. దిశ లివర్‌లో మద్యం నిల్వ భారీగా ఉందని నిపుణులు తెలిపారు. ఆరిఫ్ స్కూటీ తీసుకెళ్లాక.. చెన్నకేశవులు, శివ దిశను పొదల్లోకి తీసుకెళ్లారని పోలీసులు చెప్తున్నారు. అక్కడ చెన్నకేశవులు బలవంతంగా దిశకు మద్యం తాగించాడని తెలిపారు. దిశపై తొలుత లైంగికదాడి చేసింది చెన్నకేశవులేనని పోలీసులు ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

 మందు తాగించిన చెన్నకేశవులు

మందు తాగించిన చెన్నకేశవులు

తర్వాత శివ.. ఇంతలో అక్కడికొచ్చిన ఆరిఫ్, నవీన్ కూడా లైంగికదాడి చేశారు. ఎక్కడ విషయం బయటపడుతుందోనని గొంతునులిమి చంపి.. లైంగికదాడి చేశారు. నవంబర్ 28వ తేదీన నిందితులు నలుగురు ఉదయం నుంచి మద్యం సేవిస్తున్నారనే కొత్త విషయం తెలిసింది. సాయంత్రం ఆమెను చూశాక.. రాత్రి ఎలాగైనా అనుభవించాలని భావించారని అర్థమవుతుంది.

సరిపోలిన రిపోర్ట్

సరిపోలిన రిపోర్ట్

మరోవైపు నిందితుల డీఎన్ఏ రిపోర్టులో కూడా కీలక విషయాలు వెలుగుచూశాయి. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటకలో జరిగిన నేరాలతో నిందితుల పాత్ర ఉందని తెలుస్తోంది. ఆయా కేసుల వివరాలను, నిందితుల డీఎన్ఏ పోల్చిచూస్తే సరిపోయిందని పోలీసులు చెప్తున్నారు. దీనిపై కూడా విచారణ జరుగుతుందని.. ఆయా కేసుల వివరాలను కూడా వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు.

కమిటీ ఏర్పాటు

కమిటీ ఏర్పాటు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరునెలల్లో విచారణను పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. మాజీ న్యాయమూర్తి సిర్ పుర్కర్ చైర్మన్‌గా బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు.

English summary
disha liver has Heavy liquor fsl expert told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X